మీడియా పవర్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కరాళ నృత్యం కొనసాగుతోంది. శనివారం రాత్రి 8 గంటల వరకు 1,593 కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 5,40,598 చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో 641 కేసులు నమోదుకాగా రంగారెడ్డిలో 171, వరంగల్ అర్బన్ జిల్లాలో 131 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కరోనా కారణంగా నిన్న 8 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 463 మంది. 41,332 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా మరో 12,264 మంది వివిధ కొవిడ్ ఆస్పత్రులు, క్వారంటైన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కొవిడ్ మరణాల రేటు 0.86 శాతంగా ఉన్నట్లు ప్రభుత్వం బులిటెన్లో పేర్కొంది. శనివారం రాత్రే బులిటెన్ విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ హైకోర్టు ఆదేశాల మేరకు ఫార్మాట్ లో మార్పులు చేస్తూ వైద్యారోగ్యశాఖ తాజాగా బులిటెన్ విడుదల చేసింది. గాంధీ ఆస్పత్రిలో 1,899 కొవిడ్ పడకలు ఉన్నట్లు బులిటెన్లో పేర్కొంది. అక్కడ ప్రస్తుతం 815 మంది చికిత్స పొందుతుండగా.. మరో 1,075 పడకలు అందుబాటులో ఉన్నాయి.
Post a Comment
0Comments
3/related/default