మీడియా పవర్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోనూ కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 7,627 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 96,298కి చేరింది. ప్రస్తుతం 48,956 యాక్టివ్ కేసులు ఉండగా 46,301 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. అత్యధికంగా కర్నూల్ జిల్లాలో 1,213, తూర్పు గోదావరి జిల్లాలో 1,095 కేసులు నమోదయ్యాయి. తాజాగా 56 మంది కరోనాతో మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లాలో తొమ్మిది మంది విశాఖ జిల్లాలో ఎనిమిది, కర్నూలు జిల్లాలో ఆరుగురు మరణించారు. కృష్ణ, నెల్లూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున, చిత్తూరు జిల్లాలో నలుగురు, విజయనగరం జిల్లాలో ముగ్గురు, అనంతపురం, కడప జిల్లాల్లో ఇద్దరు చొప్పున, గుంటూరు జిల్లాలో ఒక్కరు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 10418 చేరింది. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 47,645, మొత్తంగా 16,43,319 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్లో పేర్కొంది.
Post a Comment
0Comments
3/related/default