పరిమళించిన మానవత్వం ... రైతుకు సహాయం అందించిన సోనూసూద్.

MEDIA POWER
0


మీడియా పవర్, చిత్తూరు: ఆర్ధిక కష్టాల్లో ఉన్న వారికి తనవంతు సహాయం అందిస్తూ  పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్న నటుడు సోనూసూద్ మరోసారి మానవత్వాన్ని  చాటుకున్నారు. ఓ రైతు (నాగేశ్వరరావు) కుటుంబానికి ఇచ్చిన మాటను గంటల వ్యవధిలోనే నిజం చేశారు. చకేవిపల్లి మండలం మహల్‌కు చెందిన ఓ రైతు పేదరికంలో మగ్గిపోతున్నాడు.  కుటుంబ పోషణకు వ్యవసాయం పై  ఆధార పడ్డాడు.  నేల సాగు చేసేందుకు అతని వద్ద ఎద్దులు కూడా లేని దుస్థితిని  అనుభవిస్తున్న అతనికి ఇద్దరు కూతుళ్లు కాడెద్దులుగా మారి తండ్రికి వ్యవసాయంలో దన్నుగా నిలిచారు. ఆ అమ్మాయిలిద్దరూ కాడి లాగడంతో వెనుకనుంచి తల్లిదండ్రులిద్దరూ విత్తనాలు వేశారు. వారి దీన స్థితికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియా వైరల్‌గా మదంతో వీడియో చూసి చలించిన సోనూసూద్‌ వేనువెంటనే స్పందించారు. నేటి సాయంత్రం రైతు కుటుంబానికి ట్రాక్టర్‌ ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్నీ అయన తన ట్విటర్‌ ఖాతాలో బహిర్గతం చేసారు.  అన్నమాట ప్రకారమే ఆదివారం సాయంత్రానికి సదరు రైతు ఇంటి ముందు ట్రాక్టర్‌ ప్రత్యక్షమైంది. సాయం చేస్తానని ప్రకటించిన గంటల వ్యవధిలోనే ట్రాక్టర్‌ ఇవ్వడంతో సోనూపై సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. సోనూ రియల్‌ హీరో అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక నటుడి తక్షణ సాహాయం చేసిన ఆయన దయార్థ్ర హృదాయానికి రైతు కుటుంబం  కృతజ్ఞతాభివందనను తెలిపింది. 


Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">