మీడియా పవర్,తూర్పుగోదావరి: దేశంలో ఎక్కడా లేని విధంగా కోవిడ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. కరోనా వైరస్ తీవ్రం ఉన్నప్పటికీ ప్రజలెవరూ భయాందోళన చెందవలసిన అవసరం లేదని మంత్రి అన్నారు. శుక్రవారం అమలాపురం ఆర్.డి. ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సమాజంలో పది శాతం మంది కోవిడ్ బారిన పడ్డారని,దీని నియంత్రణకు ప్రజల్లో మరింత అవగాహన కల్పించవలసిన అవసరం వుందని మంత్రి తెలిపారు. అమలాపురం డివిజన్ లో గత మార్చి నుండి ఇప్పటివరకు 22,521 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా అందులో 1,495 పాజిటివ్ గా గుర్తించడం జరిగిందని, 21,026 కేసులు నెగిటివ్ రావడం జరిగిందని మంత్రి తెలియ చేశారు.పాజిటివ్ కేసుల్లో 956 మందిని ఐసోలేషన్ సెంటర్లకు తరలించగా 525 మందిని హోమ్ ఐసోలేషన్ లో వుంచడం జరిగిందని మంత్రి తెలిపారు. మిగిలిన యాక్టివ్ కేసులు కిమ్స్ బొమ్మూరు లో చికిత్స తీసుకుంటున్నారని మంత్రి తెలియ చేశారు.1091 మందిని చికిత్స అనంతరం నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. డివిజన్ లో గత మార్చి నుండి ఇప్పటివరకు కోవిడ్ మరణాలు 14 సంభవించాయని మంత్రి తెలిపారు. అమలాపురం పురపాలక సంఘ పరిధిలో 30వార్డులు ఉండగా 24 వార్డులు కంటోన్మెంట్ జోన్ లో ఉన్నాయన్నారు.
Post a Comment
0Comments
3/related/default