మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సిదిరి అప్పలరాజు.

MEDIA POWER
0


అమరావతి, మీడియా పవర్ : పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నమ్మకాన్ని నిలబెడతానని డాక్టర్. సిదిరి అప్పలరాజు అన్నారు. ఆయన ఆదివారం ఉదయం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఆక్వా కల్చర్‌ కొత్త అథారిటీ ఏర్పాటుపై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ ఆక్వా అథారిటీతో ఆక్వా రంగానికి బలం చేకూరుతుందన్న అభిప్రాయాన్ని వెల్లడించారు. పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం బడ్జెట్‌లో 700 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఇప్పటికే అమూల్‌తో ఒప్పందం కూడా చేసుకున్నామని అన్నారు.  పేద ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలనే ఉద్దేశంతో ఫిషింగ్‌ హార్బర్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నామని మంత్రి తెలిపారు.  


Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">