ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత

MEDIA POWER
0

విజయవాడ: ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజీలోకి భారీ వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు 70 గెట్లు ఎత్తి నీటి దిగువకు వదిలారు. ప్రకాశం బ్యారేజీలో నమోదు అయిన వరద ప్రవహం .. ఇన్‌ఫ్లో 3,13,834 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 3,01,056 క్యూసెక్కులుగా ఉంది. 12 అడుగుల పూర్తీ స్థాయి నీటి మట్టంతో ప్రకాశం బ్యారేజ్ నిండుకుండలా ఉన్నది. దీంతో అధికారలు బ్యారేజీ 70 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఈస్టర్న్ ,వెస్ట్రన్ కెనాల్స్ ద్వారా 10,356 క్యూసెక్కులు నీటి విడుదల చేశారు. నదీ పరీవాహక లోతట్టు ప్రాంతంలోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గంట గంటకు పెరుగుతున్న వరద ప్రవాహం పెరుగుతోంది.



లోతట్టు ప్రాంత ప్రజలకు హెచ్చరిక..
కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వీఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నది పరివాహక ప్రాంతాలైన రణదివినగర్, భూపేష్ గుప్తా నగర్, తారకరామనగర్, భవానీపురం, విద్యాధపురం  మొదలగు ప్రాంతాల ప్రజలని అప్రమత్తం చేశారు.  నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.  పునరావాస కేంద్రాలకు  తరలి వెళ్లాలని  నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ విజ్ఞప్తి చేశారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">