మండలి చైర్మన్ షరీఫ్‌కు కరోనా పాజిటివ్

MEDIA POWER
0


ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే వున్నాయి. పేద, ధనిక అనే తేడా లేకుండా ఈ వైరస్ అందరికీ సోకుతోంది. ఇప్పటికే ఏపీలో చాలా మంది ప్రజాప్రతినిధులకు కరోనా సోకింది. తాజాగా... శాసన మండలి చైర్మన్ షరీఫ్ కి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయనకు కరోనా లక్షణాలు ఉండటంతో కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయిందని అధికారులు పేర్కొన్నారు.ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.


 

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">