న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా భారత్‌లో గడచిన 24 గంటల్లో కొత్తగా 69,921 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో.. భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 36,91,167కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 7,85,996. కరోనా వల్ల భారత్‌లో గడచిన 24 గంటల్లో 819 మంది మరణించారు. భారత్‌లో ఇప్పటివరకూ 65,288 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. భారత్‌లో 28,39,883 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు కేంద్రం ప్రకటించింది.
Post a Comment
0Comments
3/related/default