గుంటూరు కేంద్రంగా గత కొద్ది రోజులుగా భారీస్థాయిలో నిషేధిత గుట్కా వ్యాపారం కొనసాగుతోంది. అయితే ఇటీవల గుట్కాలు తయారీ, సరఫరా చేస్తున్న ముఠాను గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్టు చేసారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ఈ కేసులో లోతైన విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో గుట్కా వ్యాపారి కామేశ్వరరావు ఇంట్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కామేశ్వర్ రావు కాల్ డేటా ఆధారంగా అతడికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే దిశగా విచారణ జరుపుతున్నారు. గుంటూరు అర్బన్‌లోని పలు ప్రాంతాల్లో గోడౌన్లు ఏర్పాటు చేసుకుని కర్ణాటక నుంచి నిషేధిత గుట్కాను తీసుకువచ్చి ఇక్కడి నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నట్టు గుర్తించారు. అంతే కాకుండా ఇక్కడ గోడౌన్లలో సైతం నిసేధిత గుట్కాలు తయారీ చేస్తునట్టు గుర్తించారు. మరోవైపు మామూళ్ల కోసం స్థానిక పోలీసులు గుట్కా దందాను చూసి చూడనట్టు వ్యవహరించినట్టు సమాచారం. కామేశ్వర్ రావు తో పాటు అతడి అనుచరులను సైతం అరెస్ట్ చేయడంతో. సంబంధిత అధికారుల పేర్లు కూడా భయటకు వచ్చే అవకాశం ఉంది.
Post a Comment
0Comments
3/related/default