ఐపీఎల్ లీగ్‌ నుంచి దూరం కానున్న ఇద్దరు భారత సీనియర్‌ క్రికెటర్లు

MEDIA POWER
0


అభిమానులకు భారీ షాక్! 


యూఏఈ వేదికగా జరుగుతున్న లీగ్‌ నుంచి భారత సీనియర్‌ క్రికెటర్లు భువనేశ్వర్‌ కుమార్‌, అమిత్‌ మిశ్రా గాయాలతో దూరం కానున్నారని సమాచారం. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో  19వ ఓవర్‌లో బౌలింగ్‌ చేసిన  భువనేశ్వర్‌ తుంటికి గాయమైన సంగతి తెలిసిందే. దీంతో మ్యాచ్‌ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. అనంతరం ముంబయితో జరిగిన మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. అయితే అతడి గాయం తీవ్రత అధికంగా ఉందని సీజన్‌ నుంచి దూరం కానున్నాడని జట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. బౌలింగ్‌కు నాయకత్వం వహించే భువీ జట్టులో లేకపోవడం తమకి తీవ్ర ప్రతికూలాంశమని పేర్కొన్నాయి. మరోవైపు ఢిల్లీ  జట్టు సీనియర్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా వేలి గాయంతో టోర్నీ నుంచి నుంచి దూరం కానున్నాడని ఢిల్లీ జట్టు ఉన్నతాధికారి ఒకరు జాతీయ మీడియాకి  తెలిపారు. శనివారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో మిశ్రా వేలికి గాయమైన సంగతి తెలిసిందే. అతడు వేసిన తొలి ఓవర్‌లో నితీశ్‌ రాణా ఇచ్చిన రిటర్న్‌ క్యాచ్‌ను అందుకోవడానికి ప్రయత్నిస్తూ గాయపడ్డాడు. దీంతో గాయం కారణంగా తన స్పెల్‌ను పూర్తిచేయకుండానే ఆ మ్యాచ్‌ను ముగించాడు. అయితే అతడి స్కానింగ్ ఫలితాలు సానుకూలంగా లేవని, గాయం తీవ్రత అధికంగా ఉందని ఢిల్లీ జట్టు ఉన్నతాధికారి వెల్లడించారు. మిశ్రా ఈ సీజన్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు. అతడి స్థానాన్ని మరొకరితో భర్తీ చేస్తాం. అయితే మంచి ఆట ప్రదర్శిస్తున్న  అతడు టోర్నీ నుంచి దూరం కావడం దురదృష్టకరం. అతడి అనుభవం మిడిల్‌ ఓవర్లలో జట్టుకే కాకుండా యువ స్పిన్నర్లకు ఎంతో ఉపయోగపడుతుంది’’ అని ఢిల్లీ నుండి   ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. షార్జా వేదికగా శనివారం జరిగిన కోల్‌కతా×ఢిల్లీ మ్యాచ్‌లో 438 పరుగులు నమోదయ్యాయి. చిన్న మైదానంలో బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. కానీ రెండు ఓవర్లు వేసిన అమిత్‌ మిశ్రా 14 పరుగులే ఇచ్చాడు. తాను వేసిన తొలి ఓవర్‌లో గాయపడినా ఫిజియో చికిత్స అనంతరం మరో ఓవర్‌ బౌలింగ్‌ చేశాడు. ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్‌ గిల్‌ను పెవిలియన్‌కు పంపించి కోల్‌కతాను దెబ్బతీశాడు. అయితే తర్వాత నొప్పి అధికం కావడంతో పెవిలియన్  చేరాడు.


 


Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">