న్యూఢిల్లీ : ఎన్‌డిటివి ప్రమోటర్లు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్లపై మార్కెట్ నియంత్రణ సంస్థ (సెబి) నిషేధం విధించింది. సెక్యూరిటీ మార్కెట్‌లో రెండేళ్ల పాటు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండా నిషేధం విధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. 12 సంవత్సరాల క్రితం ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసులో అక్రమంగా రూ. 16.97 కోట్లు లబ్ధి పొందినట్లు వెల్లడైన విషయం తెలిసిందే. 2006 సెప్టెంబర్ నుండి 2008 జూన్ మధ్య కాలంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించామని, ఈ నేపథ్యంలోనే ప్రమోటర్లతో సహా పలువురిపై చర్యలు తీసుకున్నామని సెబి తెలిపింది. కంపెనీ పునర్నిర్మాణానికి సంబంధించి చర్చలు 2007 సెప్టెంబర్ 7న ప్రారంభమయ్యాయి. 2008 ఏప్రిల్ 17న షేర్ల విక్రయం ద్వారా కోట్లాది రూపాయలు లాభం ఆర్జించినట్లు దర్యాప్తులో వెల్లడైందని, రూ. 16.97 కోట్లను తిరిగి చెల్లించాలని ఆదేశించింది. కాగా, సెబి ఆదేశాలపై ఎన్‌డిటివి అప్పీలు చేయనుంది.
ఎన్‌డిటివి ప్రమోటర్లు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్లపై సెబి నిషేధం
November 29, 2020
0
Tags