No title

MEDIA POWER
0

చక్కెర ఎగుమతులపై ప్రభుత్వం సబ్సిడీ

5 కోట్ల చెరకు రైతులకు ప్రయోజనం 

న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ  చుట్టూ వ్యవసాయ చట్టాలపై కొనసాగుతున్న ఆందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం చెరకు రైతులకు బుధవారం పెద్ద ఉపశమనంకల్పించింది.  కేబినెట్ సమావేశంలో చక్కెర ఎగుమతులకు సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సబ్సిడీ డబ్బు నేరుగా రైతుల ఖాతాకు పంపబడుతుంది. ఈ నిర్ణయం ఐదు కోట్ల మంది రైతులకు మేలు చేస్తుందని ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ, సబ్సిడీ డబ్బును నేరుగా ఖాతాల్లో జమ చేయడం ద్వారా రైతులకు సహాయం చేయాలని కేబినెట్ నిర్ణయించిందాని తెలిపారు.  టన్నుకు 6000 రూపాయల చొప్పున 6 లక్షల టన్నుల చక్కెర ఎగుమతులకు సబ్సిడీ ఇవ్వబడుతుంది. ”ఈ నిర్ణయం 5 కోట్ల మంది రైతులకు, చక్కెర మిల్లుల్లో పనిచేసే 5 లక్షల మంది కార్మికులకుమేలు  చేస్తుందని ఆయన అన్నారు."ఈ సంవత్సరం చక్కెర ఉత్పత్తి 310 లక్షల టన్నులు" ఉండవచ్చని జవదేకర్ అన్నారు. కాగా  దేశంలో చక్కర  వినియోగం 260 మిలియన్ టన్నులు. అయితే చక్కెర ధర తక్కువగా ఉండటం వల్ల రైతులు, పరిశ్రమలు కష్టాలని ఎదుర్కొంటున్నాయని తెలిపారు.  దీనిని అధిగమించడానికి, 6 మిలియన్ టన్నుల చక్కెరను ఎగుమతి చేసి, ఎగుమతులకు సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. ”3500 కోట్ల రూపాయల సబ్సిడీ, ప్రత్యక్ష ఎగుమతి విలువ 18000 కోట్ల రూపాయలు అని ఆయన అన్నారు. ఈ సొమ్ము  రైతుల ఖాతాకు వెళ్తుందని , ఇవే కాకుండా ప్రకటించిన సబ్సిడీలో రూ 5661 కోట్లు వారం రోజులలో  రైతుల ఖాతాలో జమ చేయనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">