కోక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స తో
వినికిడి సమస్య నుండి విముక్తి...అపోలో హాస్పిటల్స్
మీడియాపవర్, హెల్త్ సిటీ, విశాఖపట్నం: అపోలో హాస్పిటల్ విశాఖపట్నంలో తొమ్మిది కోక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు చేసి మరో మైలురాయిని దాటింది. ఈ నెల 23,24 తేదీలలో నిర్వహించిన ఈ శస్త్రచికిత్సలతో అపోలో 70 కోక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలను నిర్వహించి వైద్యరంగంలో అద్భుతమైన ఫలితాలను సంపాదించి మరొ అడుగు ముందుకువేసింది. ఇంప్లాంట్ అంటే ఒక చిన్న ఎలక్ట్రానిక్ పరికరం , చెవిటి లేదా తీవ్రంగా వినికిడి లేని వ్యక్తి సంక్లిష్టమైన భాగాలకు అమర్చడం ద్వారా ధ్వని భావాన్ని అందిస్తారు. వినికిడి చికిత్స వలె కాకుండా, కోక్లియర్ ఇంప్లాంట్ చెవి యొక్క దెబ్బ తిన్న భాగాలను అనుసంధానం చేయటంతో ఇది శ్రవణ నాడిని నేరుగా ప్రేరేపిస్తుంది.
అపోలో హాస్పిటల్స్ విశాఖపట్నం చీఫ్ ఆపరేటింగ్ డా.సమీ మాట్లాడుతూ, “ క్లియర్ ఇంప్లాంట్ ప్రోగ్రాం వలన వినికిడి సమస్య ఉన్న పిల్లల కుటుంబాలలో చిరునవ్వులను తెస్తున్న తీరు ఆనందదాయకమన్నారు. అపోలో హాస్పిటల్స్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లో ఉత్తమ కోక్లియర్ ఇంప్లాంట్ సెంటర్ గా నిలవడం సంతోషంగా ఉందన్నారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని, అద్భుతమైన సేవలను వినికిడి భాదితులకు మెరుగైన శస్త్రచికిత్సల పట్ల అవగాహన కల్పించడంలో ఎల్లప్పుడూ ముందంజలో ఉన్నందుకు గర్వంగా ఉందని తెలిపారు. ప్రస్తుతానికి ఇంప్లాంట్ ఖర్చులు ఖరీదైనవి అయినప్పటికీ, పిల్లలకు ఏడీప్ పథకం క్రింద డా. ఈ.సి.వినయ కుమార్, ఇ.ఎన్.టి చీఫ్ మరియు కోక్లియర్ ఇంప్లాంట్ ప్రోగ్రామ్ మెంటార్ మార్గదర్శకత్వంతో, సహాయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏడీఐపి మార్గదర్శకాల ప్రకారం ఈ శస్త్రచికిత్సలు డైరెక్టర్ .సుని మరియ మాథ్యూ , మరియు ఏడీఐపి ముంబై దక్షిణ ప్రాంత నోడల్ ఆఫీసర్, డా. ఎస్.బి.రత్న కుమార్ సహకారంతో రోగులకు ఉచితంగా చేస్తున్నట్లు తెలిపారు.
కోకా రాంబాబు సీనియర్ ఇఎస్ఆ, కోక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ మరియు మెంటర్ మాట్లాడుతూ, ఇది ఖరీదైన చికిత్స అయినప్పటికీ, పిల్లలు మిగిలిన పిల్లల్లాగా సాధారణ జీవితం గడపడానికి అవకాశం కల్పిస్తుందని, ఎవరితోనైనా సాధారణ భాషనం చేస్తూ భాషా నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చన్నారు. సాధారణ పిల్లల్లాగా విద్య మరియు అన్ని రంగాలలోనూ అవకాశాలను సాధించవచ్చు. ప్రారంభ దశలో పిల్లలలో చెవుడును గుర్తించడం గురించి అవగాహన కల్పించడం చాలా అవసరం అని తెలిపారు. చెవిటితనాన్ని గుర్తించడానికి తాజా సాంకేతికత అందుబాటులో ఉంది. పిల్లలందరికీ వినికిడి కోసం పరీక్షలు నిర్వహించ వలసిన అవసరం ఉందని తెలిపారు. కోక్లియర్ ఇంప్లాంట్ ఉన్న పిల్లవాడు సాధారణ జీవితాన్ని గడుపుతూ మరియు వారి పనితీరు అధ్యయనాలలో రాణిస్తారని తెలిపారు. చాలా చిన్న వయస్సులోనే పిల్లలలో ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సలను నిర్వహించడానికి అపోలో ఆసుపత్రిలో సమర్థవంతమైన అనస్థీషియాలజిస్టుల బృందం ఉండటం సంతోషదాకమన్నారు. -
టి.కృష్ణ కిషోర్, ఇఎటి, కోక్లియర్ ఇంప్లాంట్ వైకల్యం ఉన్న రోగులను గుర్తించడానికి మరియు ఎడిఐపికి ఉత్తర ప్రతుత్తరాలు నిర్వహించడం కోసం సమన్వయం చేసుకోవడానికి ఉచిత స్క్రీనింగ్ క్యాంపులు మరియు క్లినిక్ లను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పిల్లలలో చెవిటితనాన్ని ముందస్తు గుర్తింపు చేయవలసిన అవసరం చాలా ముఖ్యమైనదని తెలిపారు. వినికిడి లోపం ఉన్న పిల్లవాడికి ఐదేళ్ల లోపు ఆపరేషన్ చేయడంలో ఉత్తమ ఫలితాలను సాధించగలమన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేసారు. చివరిగా డాక్టర్ డి. నవీన్ కుమార్, ఇఎన్ సర్జన్ ఎంఎశ్రీకాంత్ చీఫ్ ఆడియాలజిస్ట్ మరియు సంపత్ ఆడియాలజిస్టు శస్త్రచికిత్సలలో అవసరమైన ఇతర సాంకేతిక సిబ్బంది ఈ పిల్లలకు నిర్వహించిన కోక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలో పాల్గోని వారు చెవుడును అధిగమించడంలో సహాయ సహకారాలు అందించిన వారిలో ఉన్నారు.