న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం దేశంలో గత నాలుగు రోజుల్లో 6.31 లక్షల మందికి కరోనాకు టీకాలు వేశారు. ఫెడరల్ హెల్త్ మినిస్ట్రీ విడుదల చేసిన ఒక ప్రకటనలో పై విషయాన్నీ నిర్థారించారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం 6,31,417 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. అదనంగా, గత ఏడు నెలల్లో కరోనా చికిత్స పొందుతున్న వారి సంఖ్య 2 లక్షలు కాగా గడచిన 8 నెలలలో మరణించిన వారి సంఖ్య గణనీయంగా తగ్గి 140గా నమోదైనట్టు ఆ సంస్థ తెలిపింది. కేరళ మరియు మహారాష్ట్రలలో లో మాత్రమే కరోనాతో 50,000 మందికి పైగా రోగులు చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది.