72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ వినయ్ చంద్

MEDIA POWER
0

72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ వినయ్ చంద్  హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానుభావులు త్యాగాలు చేసి తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి సుమారు 200ల సంవత్సరాల విదేశీ వలస పాలన నుంచి విముక్తి చెందుటకు ఎన్నోపోరాటాలు చేయడంతో   దేశానికి 1947 ఆగష్టు, 15న స్వాతంత్ర్యం సిద్ధించింది. భారతీయ ప్రజలచేత, ప్రజల కొరకు, ప్రజల ద్వారా ప్రజాస్వామ్యయుత పరిపాలన సాగించడానికి భారత రాజ్యాంగం వ్రాయడానికై డా|| బి.ఆర్. అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసుకొన్నాము. 1935 భారత ప్రభుత్వ చట్టం మరియు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి, అధ్యయనం చేసి మన దేశానికి అనుకూలమైన సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రచించుకొని 1950 జనవరి 26 నుంచి అమలులోనికి తెచ్చుకున్నాము. రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి, 26 తేదీన మనం గణతంత్ర దినోత్సవం వేడుకలు నిర్వహించుకొనుచున్నామని గుర్తు చేశారు.  

ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ శాఖలలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలముందు   ఉంచారు. 

వ్యవసాయ శాఖ : 2020-21 సంవత్సరానికి ఖరీఫ్ లో 1,64, 835 హెక్టార్లు, రబీలో ఇప్పటివరకు 18,289 హెక్టార్లు పంటలు వేయడం జరిగింది. • రబీలో 1,296 క్వింటాళ్ళు విత్తనాలు, 13,275 మెట్రిక్ టన్నుల ఎరువులు రైతు భరోసా కేంద్రాల ద్వారా సరఫరా చేయడం జరిగింది. • జిల్లాలో 3,78,715 మంది రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.309.28 కోట్లు మరియు పి.యమ్. కిసాన్" క్రింద రూ. 209.17 కోట్లు పంపిణీ చేయటమైనది. : 2019-20 ఖరీఫ్ నందు పంట నష్టపోయిన 2,971 మంది రైతులకు ఉచిత పంటల భీమా పధకం, క్రింద రూ.2.12 కోట్లు చెల్లించటమైనది. అలాగే 5,596 మందికి పంట సాగుహక్కు పత్రాలు అందజేసి సంస్థాగత ఋణములు మంజూరు చేయడమైనది. • నివర్ తుఫాన్ కు పంట నష్టపోయిన 37,715 మంది రైతులకు రూ. 25.57 కోట్లు పంట నష్ట పరిహారం క్రింద జమ చేయడమైనది.

ఉద్యానవన & బిందుసేద్యం శాఖ : జిల్లాలో 1.68 లక్షల హెక్టారులలో ఉద్యాన పంటలు సాగు చేయబడుతూ సుమారు 6.55 లక్షల మెట్రిక్ - టన్నుల ఉద్యానవన పంటల దిగుబడి సాధించుట జరుగుచున్నది. • 2020-21 ఆర్ధిక సంవత్సరం గాను జిల్లాలో రూ.47.08 కోట్లతో వాల్యూఎడిషన్ పెంచే విధముగాఉద్యాన పధకాలు అమలు చేయుట జరుగుతున్నది. • బిందు సేద్యము ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో రూ.121 కోట్ల రాయితీతో 28,350 హెక్టార్ల విస్తీర్ణంకు ) గాను 25,890 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చడం జరిగింది.

పశు సంవర్ధక శాఖ: జిల్లాలోని 622 రైతు భరోసా కేంద్రాలలో పశువైద్యం కొరకు ప్రతి రైతు భరోసా కేంద్రానికి రూ.28,00/- లు విలువ చేసే మందులను అందచేయడమైనది. - పశు నష్ట పరిహారం క్రింద ఇప్పటివరకు 1,238 మంది లబ్ధిదారులకు 363 లక్షల రూపాయలు, అందజేయడమైనది. • జిల్లాలో 622 రైతు భరోసా కేంద్రాలలో ప్రతి రెండవ మరియు నాల్గవ బుధవారము నాడు “పశు విజ్ఞానం బడి” కార్యక్రమము ద్వారా 42,953 మంది రైతులకు శిక్షణ ఇవ్వబడినది.

మత్స్య శాఖ :2020-21 సంవత్సరమునకు గాను సముద్రంలో వేట నిషేధ కాలానికి మత్స్యకారులకు జీవన భృతి " క్రింద కుటుంబానికి రూ.10,000/- చొప్పున 20,273 మత్స్యకారుల కుటుంబాలకు రూ.2,027.31 లక్షలు వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగింది. యాంత్రిక బోట్లకు డీజిల్ పై లీటరుకు రూ. 9 చొప్పున డిశంబరు 2021 నాటికి జిల్లాలో 583 లక్షలు రూపాయలు రాయితీ ఇవ్వడం జరిగింది. • ప్రమాదవశాత్తు చేపల వేట సందర్భంగా మరణించిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం చెల్లించే, ఎక్స్ గ్రేషియా రూ. 5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచడం జరిగింది ఇప్పటికి 9 కుటుంబాలకు లబ్ది చేకూర్చడం జరిగింది.

అటవీ శాఖ :2020-21 సంవత్సరమునకుగాను 385 హెక్టార్లలో బ్లాక్ ప్లాంటేషన్లు మరియు 31 కి.మీ. అవెన్యూ ప్లాంటేషన్లు పెంచటం జరిగింది. జిల్లాలోని అటవీశాఖ ద్వారా వివిధ ప్రభుత్వ మరియు ప్రభుత్వేతరణ సంస్థలను భాగస్వాములను చేస్తూ 195.99 కోట్లు మొక్కలు నాటి జిల్లా మొత్తం పచ్చదనం పెంపొందించుట జరిగినది.

డి.ఆర్.డి.ఏ. - వెలుగు” నివేదిక : జిల్లాలో 4,87,386 మంది అర్హులకు రూ.117.80 కోట్లు విలువ చేసే 12 రకాల పెన్షన్లను ప్రతి నెలా పంపిణీ చేయడం జరుగుచున్నది. జిల్లాలో 4,16,007 స్వయం సహాయక సంఘ సభ్యులకు తేది. 11.04.2019 నాటికి ఉన్న బ్యాంకు అప్పు నిల్వ రూ.1,184 కోట్లకు గాను, మొదటి విడతగా రూ. 296 కోట్లు ఋణ మాఫీ చేయడమైనది. జనవరి 2021 నాటికి 35,716 స్వయం సహాయక సంఘములకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.960.56M కోట్లు ఋణ సదుపాయము కల్పించడము జరిగినది. 21,019 SHG సభ్యులకు రూ.106.16 కోట్లు నిధులను మహిళా బ్యాంకు ద్వారా విడుదల చేయడమైనది. కిరాణా దుకాణములు అభివృద్ధి చేసుకొనుటకు మరియు క్రొత్త వాటిని ఏర్పాటు చేసుకొనుటకు 2,3337 మంది మహిళలకు రూ.17.50 కోట్లు విడుదల చేయడం జరిగింది.

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ : 2020-21 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు లింకేజి ద్వారా 538 సహాయక సంఘములకు రూ.18.36 కోట్లు, 1,744 స్వయం సహాయక సంఘాలకు రూ. 57.74 కోట్లు ఆసరా కొరకు మంజూరు చేయడమైనది. వీధి విక్రయదారులకు సంబంధించి 733 మంది లబ్ధిదారులను గుర్తించి వారిలో 653 మందికి రూ. 66.70 లక్షలు ఋణ సదుపాయము అందించడమైనది. అలాగే కేంద్ర ప్రభుత్వ “ప్రధానమంత్రి స్వనిధి ” పధకము క్రింద 1,424 మంది లబ్ధిదారులను గుర్తించి వారిలో 738 మందికి రూ. 76.08 లక్షలు మంజూరు చేయడమైనది.

జిల్లా నీటి యాజమాన్యసంస్థ : ఈ ఏడాది 51,030 కుటుంబాలకు క్రొత్త జాబ్ కార్డులు ఇచ్చి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచాము. 66,759 మందిని క్రొత్తగా పధకంలోకి చేర్చి వెంటనే పని ఇవ్వడం జరిగింది. . 2020-21 ఆర్థిక సంవత్సరములో 270 లక్షల పని దినాల కేటాయింపులో భాగంగా ఈ జనవరి నాటికి 228 లక్షల పని దినాలను సాధించడం జరిగింది. - ఈ ఏడాది 5,772 మంది రైతులకు చెందిన 6,037 ఎకరాలలో ఉద్యానవనాల పెంపకం జరిగింది. ఎవెన్యు ప్లాంటేషన్ క్రింద రహదార్లు పొడవునా 5.69 లక్షల మొక్కలను 537 కి.మీ. వరకు నాటడం జరిగింది.

స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ : 11 గిరిజన మరియు 6 ట్రైబల్ సబ్ ప్లాన్ మండలములలో గల గర్భిణి మరియు బాలింతలకు పోషకాహార లోపం మరియు రక్తహీనత తగ్గించుటకు సెప్టెంబరు 2020 నుండి సంపూర్ణ పోషణ ప్లస్ (+) పధకము ద్వారా ప్రస్తుతం ఉన్న అనుబంధ పోషకాహారమునకు అదనపు పోషణ నిమిత్తం ప్రతి నెల ఇంటింటికి మల్టి గ్రెన్ ఆటా (2 కేజీలు), వేరుశనగ బెల్లం చక్కి, రాగి పిండి, బెల్లం మరియు ఎండుఖర్జూరం 1/2 కేజి చొప్పున అందించబడుచున్నది.  7 నెలల నుంచి 3 సంవత్సరముల వయస్సు గల 1,37,935 మంది పిల్లలకు పోషక విలువలు కలిగిన 2 1/2 కేజీల బాలామృతం అందించబడుచున్నది.

సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ - పాడేరు :  గిరిజనులకు సామాజిక హోదా కల్పించడంలో భాగంగా 51,683 మంది లబ్ధిదారులకు 86,473 ఎకరాల అటవీ హక్కు పత్రాలు మంజూరు చేసి పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. • ఏజెన్సీలో కాఫీ ప్రాజెక్టు పధకము క్రింద నాణ్యమైన కాఫీ ఉత్పత్తి చేసి రైతులు అధిక ధరలు పొందేందుకు వీలుగా 90 శాతం రాయితీపై 14 వేల బేబీ పల్పర్లను 1400 మంది కాఫీ రైతులకు పంపిణీ చేయడం జరిగింది. ని ప్రత్యేక కేంద్ర సహాయం  క్రింద రూ.75.47 కోట్లు అంచనా వ్యయంతో 196 పనులు చేపట్టడం జరిగింది. - రూ.10 కోట్లు కేంద్ర ప్రభుత్వం నిధులతో 12,500 మంది కాఫీ రైతులకు మిరియాలు సేకరణకు అవసరమైన పనిముట్లు సరఫరా చేయడం జరిగింది. - ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పధకం క్రింద రూ.119.11 కోట్ల అంచనా విలువతో 100 పనులు మంజూరు చేయడమైనది. - ఆర్.సి.పి.ఎల్.డబ్ల్యూ బ్యాచ్ క్రింద మారుమూల గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మించడానికి రూ.492.39 కోట్ల అంచనా విలువతో 104 పనులు మంజూరు చేయడమైనది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారి నిర్మాణం పధకం క్రింద రూ.11.68 కోట్ల అంచనా వ్యయంతో 52 పనులను మంజూరు చేయడమైనది.

సాంఘిక సంక్షేమ శాఖ:  8,610 మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ క్రింద రూ.20.90 కోట్లు మరియు మెస్ చార్జీలకుగాను రూ.7.44 కోట్లు మంజూరు చేయటం జరిగింది. . 2020-21 సంవత్సరమునకు సామాజిక న్యాయం క్రింద షెడ్యూల్ కులములు, షెడ్యూల్ తెగలకు చెందిన 173 మంది అత్యాచార బాధితులకు రూ.3.01 కోట్లు చెల్లించటం జరిగినది. - షెడ్యూల్డు కులముల సేవా సహకార సంస్థ ద్వారా 2020-21 సంవత్సరములో 17,103 మంది లబ్దిదారులకు రూ. 37.06 కోట్లు మంజూరు చేయడమైనది.

బి.సి. సంక్షేమ శాఖ:  66,294 మంది బి.సి. విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్ క్రింద రూ.149.54 కోట్లు , మెస్ ఛార్జీల క్రింద రూ.62.33 కోట్లు మరియు 4,928 మంది కాపు విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్ క్రింద రూ.12.11 కోట్లు , మెస్ ఛార్జీల కింద రూ.5.35 కోట్లు మంజూరు చేయడం జరిగింది. . • ఓవర్సీస్ విద్యా నిధి పధకం ద్వారా 141 మంది విద్యార్ధులకు రూ.17.50 కోట్లు మంజూరు చేయడం జరిగింది.

బి.సి. కార్పో రేషన్: కుల వృత్తి చేస్తున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు మరియు టైలరింగ్ షాపులు కలిగి వున్న వారికి సంవత్సరానికి రూ.10,000/-లు చొప్పున రెండవ విడతలో 6,785 మంది లబ్ధిదారులకు రూ. 6.78 కోట్లు ఆర్ధిక సహాయం అందజేయుటమైనది. - జిల్లాలోని 8,918 మంది కాపు కులస్తులకు ఆర్థిక సహాయార్ధమై రూ.13.37 కోట్లు రూపాయలు మంజూరు చేయడమైనది.

అల్ప సంఖ్యాక వర్గముల సంక్షేమ శాఖ :  41,595 మంది విద్యార్ధిని, విద్యార్ధులకు ఎమ్.టి.ఎఫ్. (మెయింటెనెన్స్) కొరకు రూ.362.94 లక్షలు, ఫీజు రీఇంబర్స్ మెంట్ కొరకు రూ. 624.17 లక్షల నిధులు విడుదల చేయడమైనది. • విదేశాలలో చదువుతున్న 12 మంది విద్యార్ధిని విద్యార్ధులకు ఓవర్ సీస్ ఎడ్యుకేషన్ పధకము ద్వారా రూ.101 లక్షలు నిధులు విడుదల చేయడమైనది. • జిల్లాలో మసీదు షాదిఖానాల అభివృద్ధికి గానూ రూ. 865.5 లక్షలు, చర్చిల అభివృద్ధికి రూ.149 లక్షలు మంజూరు చేయడమైనది. • మైనారిటీస్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా జిల్లాలోని 4,292 మంది మైనారిటీ మహిళలకు రూ. 8.05 కోట్లు ఆర్ధిక సహాయం వారి బ్యాంక్ ఖాతాలకు జమ చేయడమైనది.

విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ : - జిల్లాలో గల 238 దివ్యాంగులకు రూ.15.62 లక్షలు విలువ గల వివిధ రకములైన సహాయ ఉపకరణములు పంపిణీ చేయడమైనది. 

• 3 శాతం బ్యాక్ లాగ్ ఉద్యోగముల భర్తీలో భాగంగా 14 మందికి వివిధ ప్రభుత్వ శాఖలలో ఉద్యోగములుకల్పించబడినవి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ :  జిల్లాలో 2,23,897 మంది అర్హులైన లబ్ధిదారులకు క్రొత్త బియ్యం కార్డులు పంపిణీ చేయుట జరిగింది. • దీపం మరియు కార్పొరేట్ సామాజిక భాద్యత పధకం ద్వారా 3,65,068 మందికి గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయడమైనది.

వైద్య మరియు ఆరోగ్య శాఖ :  కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా 6,35,645 మంది విద్యార్ధులకు, 49,283 మంది వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించి 32,222 మందికి కళ్ళద్దములు పంపిణీ చేయటం జరిగింది మరియు 6,256 మంది వృద్ధులకు ఉచితంగా కంటి ఆపరేషన్ నిర్వహించటం జరిగింది. • ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పధకము ద్వారా 91,915 మంది మొదటి కాన్పు గర్భిణీ స్త్రీలకు రూ. 38.74 కోట్లు ఆర్ధిక సహాయం అందించటం జరిగింది. • జిల్లాలో 11,24,884 ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు పంపిణీ చేయటం జరిగింది. 2,434 రకాల వ్యాధులకు ఉచిత వైద్యం అందించడం జరుగుచున్నది. • ప్రభుత్వ ఆదేశముల మేరకు తేది. 16.01.2021 నుండి మొదటి విడత కోవిడ్-19 వ్యాక్సిను 38,945 మంది వైద్య ఆరోగ్య సిబ్బందికి ప్రణాళిక ప్రకారము వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుచున్నది. దీనికొరకు 91,000 డోసుల వ్యాక్సిన్ సిద్ధం చేయడం జరిగింది.

పాఠశాల విద్యాశాఖ - సమగ్ర శిక్షణ: 9 జిల్లాలో 1 నుండి 12వ తరగతి వరకు చదువుచున్న 6,30,386 మంది విద్యార్ధుల యొక్క 4,10,0047 మంది తల్లుల బ్యాంక్ ఖాతాల్లో రూ. 615 కోట్ల రూపాయలు జమ చేయటం జరిగింది. • 1,149 పాఠశాలల్లో రూ.307.04 కోట్లుతో పాఠశాలల రూపు రేఖలు మార్చేందుకు మౌళిక సదుపాయాలుమెరుగు పరచేందుకు పనులు చేపట్టడం జరిగింది. • ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న 3,17,202 మంది బాలబాలికలకు ఈ విద్యా సంవత్సరములో రూ.42.82 కోట్లు వెచ్చించి ఉచితంగా 3 జతల యూనిఫారంలు, 1 జత షూస్, 2 జతల సాక్స్, నోట్ పుస్తకాలు, బెల్ట్ మరియు బ్యాగ్ అందచేయటం జరిగింది.

గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుధ్య విభాగం: జాతీయ గ్రామీణ మంచి నీటి సరఫరా  (సోలార్) గ్రాంట్ క్రింద ఇంటింటి కుళాయిల ద్వారా నీరు అందించుటకు గాను రూ.23.05 కోట్లు విలువైన 334 పనులు పూర్తి చేయడం జరిగింది. సిఎండిఎఫ్  క్రింద మొత్తం 451 పనులు రూ.794.26 లక్షలతో మంజూరు కాబడి 316 పనులు పూర్తి చేయడం జరిగింది.

రహదారులు మరియు భవనముల శాఖ : ఎండిఆర్ ప్లాన్ క్రింద రూ.116 కోట్లు విలువైన 15 రోడ్డు పనులు (68 కి.మీ.) మంజూరు కాబడి 101 పనులు పూర్తయినవి. • ట్రైబల్ సబ్ ప్లాన్ క్రింద రూ. 215 కోట్లు విలువైన 17 రోడ్డు పనులు (181.25 కి.మీ.) మంజూరు అయి 10 పనులు పూర్తయినవి. • నాబార్డు RID F ద్వారా రూ. 97.20 కోట్లు విలువైన 17 పనులు మంజూరు కాగా 11 పనులు పూర్తి చేయడం జరిగింది. • సెంట్రల్ రోడ్ ఫండ్ (C R F) క్రింద రూ. 62.40 కోట్లతో 5 రోడ్డు పనులు (59.35 కి.మీ.) మంజూరు కాబడినవి వానిలో 3 పనులు పూర్తయినవి.

పంచాయితీరాజ్ సర్కిల్ : ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పధకము-1 నందు 2020-21 సంవత్సరమునకు మిగులు అంచనా విలువ రూ. 185.10 కోట్లుతో, 80 రోడ్డు పనులు (136.04 కి.మీ) చేపట్టి 20 రోడ్డు పనులు పూర్తి చేయడం జరిగింది.  ఆర్పీసిఎల్  డబ్ల్యూ  పధకము మొదటి దశలో 2020-21 సంవత్సరమునకు మిగులు అంచనా విలువ రూ.84.327 కోట్లతో 31 రోడ్డు పనులు (107.59 కి.మీ), రెండవ దశలో 16 పనులు (115.38 కి.మీ.) రూ. 83.94 కోట్లు అంచనా విలువతో మంజూరు అయినవి. మూడవ దశలో 44 రోడ్డు పనులు (410.85 కి.మీ.) మరియు 2 వంతెన పనులు రూ. 268.82 కోట్లు అంచనా విలువతో  చే మంజూరు కాబడినవి. • మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకము క్రింద రూ.260.95 కోట్లతో 728 గ్రామ సచివాలయ భవనముల నిర్మాణము, రూ. 95.90 కోట్లతో 548 గ్రామీణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణము మరియు రూ.153 కోట్లతో 702 రైతు భరోసా కేంద్రాల నిర్మాణం పనులు జరుగుచున్నవి. • గ్రామాలలో సిమెంటు రోడ్లు నిర్మాణము కొరకు ప్రతి అసెంబ్లీ నియోజక వర్గమునకు రూ.15.25 కోట్లు, మైదాన ప్రాంతములలో తారు రోడ్లు నిర్మాణము కొరకు ప్రతి అసెంబ్లీ నియోజక వర్గమునకు రూ. 5 కోట్లు మరియు ఏజెన్సీలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గమునకు రూ. 20 కోట్లు మంజూరు కాబడినవి.

జల వనరుల శాఖ: బాబూ జగజ్జీవనరామ్ ఉత్తరాంధ్ర సృజల స్రవంతి పధకం లో భాగంగా ప్రస్తుతము 1.30 లక్షల ఎకరాల ఆయకట్టునకు సాగునీరు అందించుటకుగాను రూ. 928 కోట్లతో పనులు రెండు ప్యాకేజీలుగా జరుగుచున్నవి మరియు రూ.3,050 కోట్లు విలువైన మరో ప్యాకేజీ కోసం టెండర్లు పిలవడం జరిగింది. గృహ నిర్మాణ శాఖ : - ఈ సంవత్సరం జిల్లాలో పట్టణ మరియు వి.ఎమ్.ఆర్.డి.ఎ. పరిధిలో గల 15 మండలాల్లో ఇళ్ళు మంజూరుకు అర్హులైన 52,050 లబ్దిదారులను గుర్తించి గృహములు కేటాయించడమైనది. ప్రతి ఇంటికి రూ.1.80 లక్షల చొప్పున పూర్తి సబ్సిడీతో రూ. 936.90 కోట్లు గ్రాంటు జిల్లాకు కేటాయించడమైనది. • ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఆంధ్రప్రదేశ్ టిడ్ కో ద్వారా ఆర్బన్ పరిధిలో రూ.1,240.27 కోట్లతో 26,448 జి+3 ఇళ్ళు నిర్మాణం జరుగుతున్నది. • పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 3,00,124 మంది అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, ఇళ్ళ పట్టాలు కేటాయించుటకై 5,364.38 ఎకరాల భూమిని సేకరించడమైనది. లబ్ధిదారులకు ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుచున్నది.

తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ : జిల్లాలోని 43,080 వ్యవసాయ బోర్లకు నిరంతరాయంగా పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్ ను ఇవ్వటం జరుగుచున్నది. - జిల్లాలోని 1,28,148 యస్.టి. మరియు 38,220 యస్.సి. విద్యుత్ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను రూ. 83.38 కోట్ల సబ్సిడీతో ఇవ్వడం జరుగుచున్నది. తుఫాన్ల సమయంలో విశాఖపట్నం నగరం అంతటా అంతరాయం లేని విద్యుత్ సరఫరా కొరకు ప్రపంచం బ్యాంకు వారి ఆర్ధిక సహాయంతో భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థ పనులను రూ.720 కోట్ల ఖర్చుతో ప్రారంభించి ఇప్పటివరకు రూ. 361.30 కోట్ల ఖర్చుతో రూ. 35,138 విద్యుత్ కనెక్షన్లను భూగర్భ విద్యుత్ వ్యవస్థలోనికి తీసుకురావడం జరిగినది.

జిల్లా పరిశ్రమల కేంద్రం ,పారిశ్రామిక అభివృద్ధి : 2020-21 సంవత్సరములో 178 సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు 336.79 కోట్ల రూపాయల పెట్టుబడితో స్థాపించబడి 3,156 మందికి ఉపాధి కల్పించడమైనది. • జిల్లాలో 2020-21 సంవత్సరములో 11 భారీ పరిశ్రమలు రూ.3,580.50 కోట్లు పెట్టుబడితో స్థాపించబడి 4,254 మందికి ఉపాధి కల్పిండమైనది. • కోవిడ్-19 ద్వారా దెబ్బ తిన్న పరిశ్రమలకు ఎంఎస్ఎంఈ - రీ -స్టార్ట్  పధకము క్రింద జిల్లాలోని 386-పరిశ్రమలకు రూ.7,300 లక్షల పెండింగ్ లో ఉన్న రాయితీలు విడుదల చేయడమైనది.

గనులు మరియు భూగర్భ శాఖ :  క్వారీలు మరియు గనులు వలన ప్రభావితమయ్యే ప్రాంతాలలోని ప్రజల, నివాస ప్రాంతాల అభివృద్ధి మరియు సంక్షేమము కొరకై జిల్లా ఖనిజముల నిధి ద్వారా రూ. 55.18 కోట్లు వసూలు చేసి 4074 అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. పర్యాటక శాఖ : • భారత ప్రభుత్వంచే బ్లూ ప్లాగ్ సర్టిఫికేషన్ కొరకు ఎంపిక కాబడిన 8 బీచ్ లలో ఒకటైన ఋషికొండ బీచ్ లో రూ.7.32 కోట్లతో ఎకో ఫ్రెండ్లీ మౌలిక సదుపాయాలు పూర్తి కాబడి తేది. 1.11.2020న అంతర్జాతీయ, బ్లూ ప్లాగ్ బీచ్ గా గుర్తింపు పొందినది. శ్రీ వరాహ లక్ష్మి నరసింహస్వామి దేవస్థానం, సింహాచలం వద్ద యాత్రికులకు సౌకర్యములు కల్పించుటకు భారత ప్రభుత్వం రూ. 53.69 కోట్లు P R A S A D స్కీమ్ (Piligrimage Rejuvenation and Spiritual A ugmentation Drive Scheme) ద్వారా మంజూరు కాబడినవి.

రవాణా శాఖ : జిల్లాలో సొంత ఆటో, టాక్సీ, మాక్సీ కేబ్ కలిగిన 38 వేల మంది వాహన లబ్ధిదారులకు ఆర్ధిక సహాయార్ధం రూ.38 కోట్లు అందించడం జరిగింది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లిమిటెడ్ : : జిల్లా రైతాంగానికి 2020-21 ఆర్ధిక సంవత్సరమునకుగాను 40,584 మందికి స్వల్పకాలిక ఋణములు, క్రింద రూ. 202.78 కోట్లు, దీర్ఘకాలిక ఋణములు క్రింద 61 మందికిగాను రూ.2.91 కోట్లు మంజూరు చేయడమైనది. జిల్లా పంచాయితీ శాఖ : • స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ వారి ఆధ్వర్యంలో జిల్లాలో ట్రైసైకిల్స్ మరియు డస్ట్ బిన్స్ సరఫరా చేయడమైనది. • “మన గ్రామం-మన పరిశుభ్రత" కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని గ్రామ పంచాయితీలలో సమగ్ర పారిశుధ్య కార్యక్రమ పనులు చేపట్టటం జరిగింది.

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్: జి.వి.యం.సి. ప్రగతిలో రూ.302.77 కోట్ల వ్యయంతో 1,978 పనులను చేపట్టడం జరిగింది.  స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు : భారత ప్రభుత్వం దేశంలో ఎంపిక చేసిన స్మార్ట్ సిటీ పధకం అమలు 20 పట్టణాలలో జరుగుచుండగా, అందులో విశాఖపట్నం 8వ స్థానంలో నిలిచింది. ఈ పధకం క్రింద మొదటి ) దశలో 1000 కోట్లతో 61 ప్రాజెక్టు పనులు చేపట్టడానికి భారత ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. నియంత్రించడం వంటి ముఖ్య పనులను చేపట్టడానికి తగు చర్యలు తీసుకోవడం జరిగింది.

• ఏసియా డెవలప్ మెంట్ బ్యాంకు ఋణ సహాయ పధకం క్రింద పట్టణ ఉత్తర భాగంలో మరియు పశ్చిమ భాగం ప్రాంతాలలో నిరంతరం మంచి నీటి సరఫరా కొరకు రూ. 386 కోట్లతో పనులు చేపట్టడం జరిగింది. • స్వచ్ఛ విశాఖ లక్ష్యంగా : జి.వి.యం.సి. పరిధిలో స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్, స్వచ్ఛ విశాఖ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. చెత్త రహిత నగరంగా, O D F నగరంగా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్టిఫికేట్సను అందజేసింది. నీటి సరఫరా : నగరంలో భూ గర్భ డ్రైనేజి (యు.జి.డి.) నెట్ వర్క్ క్రింద 55 కిలోమీటర్ల పరిధిలో 11 వేల ఇండ్లకు భూగర్భ డ్రైనేజి లైన్ల ఏర్పాటుకు తగు చర్యలు చేపట్టడం జరిగింది. భూగర్భ డ్రైనేజి మేన్ హోల్సే ను శుభ్రం చేయడం కోసం వ్యక్తులకు బదులుగా యాంత్రికంగా హైడ్రాలిక్ మెషీన్లను ఉపయోగించుటకు గాను తగు చర్యలు చేపట్టడం జరిగింది.

వి.యమ్.ఆర్.డి.ఎ: పూర్తి చేసిన పనులు :  ఆనందపురం జంక్షన్ నుండి బోని జంక్షన్ వరకు 9 కిలోమీటర్ల బి.టి. రహదారిని సింగిల్ లేన్ నుండి రెండు లేన్లుగా అభివృద్ధి పరచుటకు రూ.7.55 కోట్లు వ్యయంతో పూర్తి చేయడం జరిగింది. కొనసాగుతున్న ప్రాజెక్టులు : • ఎన్.ఎ.డి. వద్ద ట్రాఫిక్ సమస్యలు అధిగమించడానికి రూ.150 కోట్ల అంచనా వ్యయంతో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. : విశాఖ వ్యాలీ స్కూల్ ద్వారా ఎన్. హెచ్-16 జంక్షన్ నుండి బీచ్ రోడ్డు వరకు 1.6కి.మీ. పొడవు గల మాస్టర్ ప్లాన్ రోడ్ నిర్మాణానికి రూ.8.34 కోట్లు వ్యయంతో పనులు జరుగుచున్నవి. • ఎ.పి.డి.ఆర్.పి. ప్రాజెక్ట్ క్రింద పునరాభివృద్ధి పనులు కొరకు 380 ఎకరముల కైలాసగిరి హిల్ టాప్ పార్క్ అభివృద్ధి కొరకు రూ. 56.55 కోట్లు (ప్రపంచ బ్యాంక్ నిధులతో) పనులు జరుగుచున్నవి. • బీచ్ రోడ్డు నందు ఇంటిగ్రేటెడ్ మ్యూజియం మరియు టూరిజం కాంప్లెక్స్ నిర్మాణానికై రూ.40.00 కోట్లు పనులు కొనసాగుతున్నాయి. రామ్ నగర్ వద్ద వాణిజ్య సముదాయాలు నిర్మాణ పనులు రూ.13.50 కోట్ల అంచనా వ్యయంతో పురోగతిలో ఉన్నాయి.

    జిల్లా అభివృద్ధికి మరియు సంక్షేమ కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేయుటకు కావలసిన నిధులు మంజూరులో మరియు అభివృద్ధి సాధించుటలో తగు సూచనలు, సహకారం అందిస్తున్న ప్రభుత్వానికి మరియు గౌరవ ప్రజా ప్రతినిధులందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లాలో సమర్ధవంతంగా న్యాయసేవలు అందిస్తున్న జిల్లా న్యాయాధికారి వారికి మరియు ఇతర న్యాయాధిపతులందరికీ నా ధన్యవాదాలు. జిల్లాలో శాంతి భద్రతలను సమర్ధవంతంగా కాపాడుతున్న కమీషనర్ ఆఫ్ పోలీస్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరియు వారి సిబ్బందికి నా ధన్యవాదములు. అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్న వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులకు , నా ధన్యవాదములు. స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొని ఈనాటి తరానికి స్ఫూర్తి ప్రధాతలుగా నిల్చిన మన స్వాతంత్ర్యం సమరయోధులుకు నా నమస్సుమాంజులులు తెలిపారు. 

    జిల్లా అభివృద్ధికి సహకారం అందిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు, ప్రజలకు, బ్యాంకు అధికారులకు అభినందనలు తెలిపిన అయన  ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి  ప్రత్యేక అభినందనలను తెలిపారు. 

    జిల్లా సమగ్ర, సర్వతోముఖాభివృద్ధికి సంక్షేమ పథకాల ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రజల అందరి సహకారం కోరుతూ మరొక్కసారి 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. 














Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">