ఘనంగా మకరసంక్రమణం పూజలు... పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు

MEDIA POWER
0

మీడియా పవర్, కవిటి ప్రతినిధి,  శ్రీకాకుళం:  ప్రతిఏటా క్రమం తప్పకుండా వంశపారంపర్యంగా నిర్వహిస్తున్న మకరసంక్రమణ పూజా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్  కళింగ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ బెందాళం పద్మావతి బాలకృష్ణ దంపతులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా  కవిటి మండలం బొరివంక గ్రామం లో వెలసియున్న శ్రీ కాళీ మాత అమ్మవారి సన్నిధిలో జరిగిన పూజ కార్యక్రమంలో వీరు పాల్గొని పూజ, హోమం ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన  వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆర్ధికంగా ఎదగాలన్న సంకల్పంతో  మన నవ యువ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్నారని  తెలిపారు. ఆంధ్ర ప్రజల కోసం  ఇంత  కృషిచేస్తున్న ఆయనకు అమ్మవారు అష్టైశ్వర్యాలు ఆయుర్భాగ్యాలు   ప్రసాదించి, మన రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకు వెళ్లేందుకు సహకరించాలని అమ్మవారిని ప్రార్ధించారు. గౌరవ ముఖ్యమంత్రి అమలుచేస్తున్న నవరత్నాలకు  తగిన వనరులు కల్పించాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులతో పాటు గ్రామ ప్రజలు యువజన సంఘం నాయకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అక్కడికి విచ్చేసిన గ్రామ ప్రజలందరికి బెందాళం పద్మావతి బాలకృష్ణ దంపతులు సంక్రాంత్రి శుభాకాంక్షలను తెలిపారు. 
x

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">