ముప్పాళ్ల మల్లిఖార్జున స్వామి ఆలయంలో చోరీ.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

MEDIA POWER
0

మీడియా పవర్,ఈపూరు: గుంటూరు జిల్లా ఈపూరు మండలంలోని ముప్పాళ్ల గ్రామంలో కొలువై వున్న  శ్రీభ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి ఆలయంలో చోరీ జరిగింది.  పోలీసులు తెలిపిన  వివరాల ప్రకారం దేవాలయంలో బుధవారం రాత్రి 11గం30ని.వరకు గ్రామోత్సవంలో భాగంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అర్ధరాత్రి సమయంలో ఈ చోరీ జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. గేట్ల, తలుపులకు ఉన్న తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు మల్లిఖార్జునస్వామికి ఇరువైపుల వేంచేసి వున్న భద్రకాళి, భ్రమరాంబికాదేవి మెడలో ఉన్న శతమానాలు, ముక్కు పుడకలను దోచుకెళ్లినట్టు తెలుస్తోంది. గురువారం ఉదయం పూజలు చేయడానికి  వచ్చిన పూజారి నాగమల్లేశ్వర శర్మ అమ్మవార్ల శతమానాలు, ముక్కు పుడక లేకపోవడం గమనించి గ్రామస్థులు, పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ సింగయ్య ఘటనాస్థలిని పరిశీలించి  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">