ఎస్వీబీసీకి రూ.1,11,11,111 కోట్ల విరాళం
తిరుమల: కర్ణాటకలోని హుబ్లీకి చెందిన డీఆర్ఎన్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ప్రైవేట్
లిమిటెడ్ సీఈవో దినేష్ నాయక్ ఎస్వీబీసీ ట్రస్ట్‌కు రూ.1,11,11,111
విరాళంగా ఇచ్చారు. తిరుమలలో అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డిని ఆదివారం రాత్రి
ఆయన క్యాంప్ కార్యాలయంలో కలసి ఈ మొత్తానికి సంబంధించిన డీడీ అందజేశారు.
దినేష్ నాయక్ గత నెలలో అన్న ప్రసాదం ట్రస్ట్ కు కూడా కోటి రూపాయలు విరాళంగా అందించారు.