తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో 142 ఆలయాలపై జరిగిన దాడులపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. శుక్రవారం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోఆయన మాట్లాడుతూ ఇతర మతాలపై దాడి జరిగితే గగ్గోలు పెడుతున్న ప్రపంచమంతా. హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే పట్టించుకోరే అని నిలదీశారు. ‘‘హిందువుల పట్ల ఒకలా, ఇతర మతాల పట్ల ఒకలా స్పందించటం తప్పుని, అన్ని మతాల పట్ల సమభావంతో ఉండటమే సెక్యులరిజం అన్నారు. సెక్యులరిజం అంటే హిందూ ఆలయాలపై దాడులు జరిగితే మౌనంగా ఉంటూ ఏ మాత్రం బాధ్యత లేకుండా వైకాపా సర్కారు వ్యవహరిస్తోందాని అన్నారు. ఓ రథం పోతే ఇంకో రథం చేయిస్తామంటారా ప్రభుత్వ పెద్దలు? రాష్ట్రంలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 విచ్చల విడిగా ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియాతో చిన్న చిన్న పోస్టులు పెడితే నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారు. దళితులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆవేదన వ్యక్తం చేసారు. శాంతి భద్రతలను కాపాడాలని కోరిన వారిపైన కేసులు పెడుతున్నారు. వైకాపా ఎమ్మెల్యేలు మాత్రం విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. అదృష్టం అందలమెక్కిస్తే బుద్ధి బురదలో పొర్లిందన్న రీతిలో సాగుతోంది వైకాపా పాలన అని ఎద్దేవా చేసారు. పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన నేతలు పేకాట క్లబ్బులను నిర్వహించే స్థాయికి దిగజారడాన్ని తప్పుపట్టారు. మీడియాపై కూడా దాడులు పెరుగుతున్నాయన్నారు. రామతీర్థం వచ్చి ఆందోళన చేయడానికి మాకు క్షణం పట్టదు. మతం కంటే మానవత్వం ముఖ్యమని జనసేన నమ్ముతుందని తెలిపిన అయన ఎన్నికల్లో పోటీకి నిలబడిన వారిపై దాడులు చేసే సంస్కృతి మంచి పద్ధతి కాదని హితవుపలికారు. ఈ అరాచకాలపై అందరూ సమష్టిగా పోరాడాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. అందుకు జనసేన పార్టీ ముందుంటుంది’’ అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
వైకాపా అరాచకాలపై అందరూ సమష్టిగా పోరాడుదాం: పవన్
January 22, 20211 minute read
0
Tags