ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం

MEDIA POWER
0

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటర్ గా నమోదు చేసుకోవాలని

సబ్ కలెక్టర్ ఎన్ మౌర్య విజ్ఞప్తి
    నర్సీపట్నం : ఓటు అనేది ప్రతి భారతీయునికి మన భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అనీ, ఈ సంవత్సరం జనవరి 1 వ తేది నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ యువకులు తమ ఓటును నమోదు చేసుకోవాలని నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్ మౌర్య విజ్ఞప్తి చేశారు. నేడు 11 వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నర్సీపట్నం శ్రీ కన్య థియేటర్ జంక్షన్ నుండి అబిిద్ సెంటర్ వరకు విద్యార్థినీ విద్యార్థులతో ఓటర్లకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్ మౌర్య ప్రారంభించారు. అబిద్ సెంటర్ వద్ద మానవహారంగా ఏర్పడి జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం సబ్ కలెక్టర్ మాట్లాడుతూ 1950 వ సంవత్సరం జనవరి 25 వ తేదీన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చట్టసవరణ చేయడం జరిగిందని తెలిపారు. 18 సం.లు నిండిన వారిలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించేందుకు 2011 సంవత్సరం , జనవరి 25 నుండి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని గుర్తుచేశారు.
      పంచాయితీ ఎన్నికల నుండి పార్లమెంట్ ఎన్నికల వరకు భారత పౌరుడిగా తమ విలువైన ఓటు హక్కును మంచి పరిపాలన అందించే నాయకులను ఎన్నుకునేందుకు వీలుగా యువతకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.
    జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈరోజు కేంద్ర ఎన్నికల కమిషన్ ఎలక్ట్రానిక్ యాప్ , పోర్టల్ ద్వారా నూతనంగా ఈ- ఎపిక్ కార్డు ప్రక్రియను అందుబాటులోకి తీసుకు వచ్చిందని అన్నారు. నేటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరూ మొబైల్ / కంప్యూటర్లో వెబ్ సైట్ ద్వారా ఈ-ఎపిక్ కార్డ్ కు నమోదు చేసుకోవచ్చునన్నారు. ప్రతి ఒక్కరికి జాతీయ ఓటరు దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు.
    ఎన్నికల ప్రత్యేక డిప్యూటీ తహసీల్దార్ సూర్య నారాయణ మాట్లాడుతూ ఓటు హక్కు అనేది మన భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు అనీ నిష్పక్షపాతంగా కుల, మత, వర్గ, పార్టీలకతీతంగా సుపరిపాలన అందించే నాయకులను ఎన్నుకునేందుకు చక్కటి అవకాశం ఉందని అన్నారు. ప్రతి ఎన్నికలలో ఓటు హక్కును కచ్చితంగా ప్రతి ఒక్కరు వినియోగించుకావాలన్నారు. 18 సంవత్సరాలు నిండినవారు ఆన్ లైన్ లో గాని, తహసీల్దార్ / సబ్ కలెక్టర్ కార్యాలయంలో గాని పేర్లను నమోదు చేసుకొవచ్చునని, లేదా ఈ -పోర్టల్ ద్వారా ఎపిక్ కార్డును పొందవచ్చునన్నారు.
ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ పి. కాంతారావు ,మండల తహసీల్దార్ జయ, మున్సిపల్ , రెవెన్యూ కార్యాలయ అధికారులు , పోలీస్ అధికారులు, వార్డు సచివాలయ సిబ్బంది, పలు కళాశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

-------------------------------------------------------------------------------

    డివిజన్ స్థాయి ఉత్తమ ఎన్నికల అధికారిగా సబ్ కలెక్టర్ ఎన్ మౌర్య కు అవార్డ్ లభించింది. 2020 ఓటర్ జాబితాల సవరణ లో మెరుగ్గా సేవలను నిర్వహించి నందుకు సబ్ కలెక్టర్ అవార్డ్ కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది సబ్ కలెక్టర్కు శుభాకాంక్షలను తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">