ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి –రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి
January 18, 2021
0
విశాఖపట్నం: ప్రతి గ్రామంలోను ఇళ్లు లేని పేదలు ఉండకూడదని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆశయమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. భీమిలి నియోజకవర్గం టి.నగరపాలెం, దాకమర్రి, మూలకుద్దు గ్రామంలలో ఇంటిస్థల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు మూలకుద్దు గ్రామంలో జరిగిన ఇంటిస్థల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అమ్మఒడి, వాహనమిత్ర వంటి 22 పధకాల ద్వారా ఈ గ్రామానికి రూ.5కోట్ల 60 లక్షల రూపాయలు అందించటం జరిగిందని తెలిపారు. వివక్ష లేకుండా ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం అందిస్తున్నామని అన్నారు. ఇంటిస్థల పట్టా కూడా మహిళల పేరునే అందించి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని నిరూపించుకున్నారన్నారు. ఈ గ్రామంలో అందిస్తున్న ఇంటి స్థలం 15 లక్షలు ఖరీదు చేస్తుందన్నారు. త్వరలోనే విశాఖపట్నం పరిపాలనారాజధానిగా వస్తున్నదని కావున మీకు యిస్తున్న ఇంటి స్థలాలు, భూములు అమ్ముకోవద్దని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న అమ్మఒడి డబ్బులతో పిల్లలను చక్కగా చదివించుకోవాలని సూచించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈ ప్రభుత్వం సుమారు 4 లక్షల మంది నిరుద్యోగులకు సచివాలయ ఉద్యోగులుగా, అన్న మంత్రి ప్రశ్నకు ముగ్గరు మహిళలు రేషనుకార్డు సమస్యలతో స్థలం మంజూరు కాలేదని తెలిపారు. మంత్రి వెంటనే వారి సమస్యలను పరిష్కరించి వారి ఇంటిస్థలం కేటాయించవలసినదిగా గ్రామరెవిన్యూ అధికారి, గ్రామవలంటీర్లను ఆదేశించారు. త్వరిత గతిన సమస్యను పరిష్కరించవలసినదిగా తహశీల్దారుకు సభాముఖంగా సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు, ఎం .పి.డి.ఒ. ఇతర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.
Tags