జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేసిన విజ్ఞానమూర్తి...సుబ్రహ్మణ్యుడు.

MEDIA POWER
3 minute read
0

    స్కందుడు రాశీభూతమైన జ్ఞానస్వరూపుడు. ఆయన చేతిలోని 'శక్తి' ఆయుధం సునిశితమైన మేధకు ప్రతీక. ఇచ్చా, జ్ఞాన, క్రియాశక్తులనే మూడుశక్తుల సంయోగ స్వరూపంగా నిలిచి, అజ్ఞానం అనే తారకాసురుడిని సంహరించి, జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేసిన విజ్ఞానమూర్తి ఆయన. గొప్పజ్ఞానంతో పాటు అపారమైన భుజశక్తికి కూడా స్కందుడు ప్రతీక. రాక్షససంహార విషయంలో దేవత లకే సేనానాయకుడిగా నిలిచి, వారిని ఆదుకున్న ధీశాలి సుబ్రహ్మణ్యుడు.

    స్కందుడన్న పేరు సుబ్రహ్మణ్యస్వామికి ప్రసిద్ధ స్కందుడన్న పేరు సుబ్రహ్మణ్యస్వామికి ప్రసిద్ధమైంది. స్కన్నమైన (జారిన) వాడు స్కందుడు. శివుని ఆత్మజ్యోతినుండి ఆవిర్భవించిన ఆరు జ్యోతులస్వరూపమే సుబ్రహ్మణ్యుడు. ఆయనే శరవణభవుడు, కార్తికేయుడు.  కుమారస్వామి.... ఇలా సుబ్రహ్మణ్యస్వామికి ఎన్నో పేర్లు వ్యాప్తిలో ఉన్నాయి. శివపార్వతుల తనయుడిగా స్కందుడు ఆవిర్భవించిన తిథి 'షష్ఠి'. శక్తి కారకుడిగా పేరున్న ఆ స్వామి తారకాసురసంహారసందర్భంలో దేవతలకు సేనాధి పత్యం వహించి, రాక్షససంహారం చేసినరోజు మార్గశిర శుద్ధషష్ఠి. ఈ కారణాలవల్ల మార్గశిర శుద్ధషష్ఠి 'స్కందషష్ఠి'గా వ్యాప్తిలోకి వచ్చింది.

సుబ్రహ్మణ్య వైభవం 

      బాలసుబ్రహ్మణ్యుడు రూపంలో అందగాడు. శౌర్యంలో సాటి లేనివాడు. అందుకే దేవసేనాధిపతి అయ్యాడు. ఈయన వాహనం నెమలి. ఆయుధం శూలం. దీనిని విజయశూల మనీ, జ్ఞానశూలమనీ అంటారు. సుబ్రహ్మణ్యుడికి షణ్ముఖుడు అన్న పేరుంది. అంటే ఆరుముఖాలు కలవాడని అర్థం. ఈ ఆరుముఖాలు జ్ఞానం, వైరాగ్యం, శక్తి, యశస్సు, ఐశ్వర్యం, దైవత్వానికి ప్రతిరూపాలు.

    కార్తికేయుడు మేధామూర్తి వేదాలు ఇతణ్ణి కార్తికేయుడు మేధామూర్తి. వేదాలు ఇతణ్ణి యజ్ఞాగ్నిగా అభివర్ణించాయి. ఉపనిషత్తులు సనత్కు మారుడిగా కీర్తించాయి. శివుడి ప్రణవనాదమైన 'ఓం'కార అర్థాన్ని వివరించి చెప్పినఘనతకూడా సుబ్రహ్మణ్యుడికే దక్కుతుంది. ఈ విధంగా ఆదిదేవుడికే గురుదేవుడు అయ్యాడు కుమారస్వామి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో 'సేనాధి పతులలో స్కందుడిని నేను' అని ప్రకటించటం స్కందుడి ప్రాశస్త్యాన్ని తెలియజేస్తుంది.

     వేదాలలో షణ్ముఖీయమైనసంవత్సర స్వరూపంగా స్వామిని వర్ణించారు. కాలాగ్నిస్వరూపమే ఇది. కాలాగ్ని రుద్రుడైన శివునితేజమే ఈ సంవత్సరాగ్ని ఆరుముఖాలను ఆరుఋతువులకు ప్రతీకగా, పన్నెండు చేతులను పన్నెండు మాసాలకు ప్రతీకలుగా చెప్పుకోవచ్చు. ఇదీ సంవత్సరాగ్ని రూపం. ఈ రూపం చిత్రాన్ని అనే నెమలిపై ఆసీన మయ్యింది. వివిధ వర్ణాలను వెదజల్లే కాంతిపుంజమే ఈ నెమలి. ఈ విధంగా అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తులకు సుబ్రహ్మణ్య ఉపాస కేంద్రంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య ఉపాసనద్వారా మోక్షాన్ని అందుకున్న మహనీయులు ఎందరో ఉన్నారు.

యోగస్వరూపుడు 

     మానవదేహంలో మూలాధారస్థానంలో కుండలినీ శక్తి మూడున్నరచుట్లు చుట్టుకుని నిద్రిస్తున్నపాములా ఉంటుంది. సాధకుడిలో ఆశక్తి జాగృతమై సహస్రారం వరకు ప్రయాణిస్తుందని యోగశాస్త్రం చెబుతోంది. సాధనలో మూలాధారంనుంచి ఆజ్ఞాచక్రంవరకు ఆరుస్థానాలు క్రమంగా వికాసం పొందితే ఆ పైన ఉన్న సహస్రారంలో ఆ పరమచైతన్యం అనుభవానికి వస్తుంది. పరమాత్మ సుబ్రహ్మణ్య రూపంలో అవతరించే క్రమంలో ఆరుముఖాలతో దర్శన మిస్తాడు. ఇవి ఆరుచక్రాలకు సంకేతం. కుండలినీశక్తి సర్పా కారంలో ఉంటుందని యోగశాస్త్రం చెబుతోంది. ఈ యోగా నికి అధిపతి కుమారస్వామి. ఈ విషయాన్ని సంకేత రూపంలో చెప్పటమే సుబ్రహ్మణ్యుడు సర్పరూపంలో ఉంటా డని వర్ణించటానికి కారణం.

    షణ్ముఖుడు జ్యేషానక్షత్రంలో జన్మించాడు. ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు. బుధుడు జ్ఞానమిచ్చేవాడు. జ్ఞానాన్ని సంస్కృతంలో సుబ్రహ్మ అంటారు. అందువల్ల ఈ స్వామి సుబ్రహ్మణ్యేశ్వరుడని ప్రసిద్ధి చెందాడు. ఈయన జన్మరాశి వృశ్చికం నుండి జన్మలగ్నమైన మేషంవరకు ఆరు రాశులు ఉన్నాయి. ఈ ఆరురాశులు మనశరీరంలోని షట్ చక్రాలు. వృశ్చికరాశిని తోకగా పరిగణిస్తే మేషరాశి పాము శిరస్సు అవుతుంది. ఈ పద్ధతిలో స్వామి కుండలినీ ప్రభువు అయ్యాడు. ఇవన్నీ జ్ఞానవైరాగ్యాలకు సంబంధించిన విషయాలు. సర్పం వీటికి సంబంధించింది. అందువల్లనే సర్పాలను సదాశివుడు ధరించి పన్నగభూషణుడని ప్రసిద్ధి చెందాడు. ఈ పన్నగాలు సుషుమ్నా నాడీ రూపంలో ఉన్న షణ్ముఖుని విభూతిరూపాలు. ఆ కారణంగా సుబ్రహ్మణ్యే శ్వరుణ్ణి సర్పరూపంలో పూజిస్తారు. 

ఆరక్షరాల దైవం

     షణ్మతాలలో కుమారోపాసన ఒకటి. కంఠంలో రత్నాలు, మేనిలో, చక్కదనం, చేతిలో జ్ఞానశక్తి ఆయుధం, ముఖాన చిరునవ్వు, కటియందు (నడుము భాగం) హస్తాన్ని ఉంచి, నెమలిపై ప్రకాశిస్తుండే స్వామి సుబ్రహ్మణ్యుడు. పరిపూర్ణమైన జ్ఞానస్వరూపుడు. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా అనే మూడు శక్తులమయమైన శక్తిని ధరించిన కుమారస్వామి, శరణన్నవారిని కాపాడే దేవుడు. అమోఘమైన శివతేజం పృథ్వి, అగ్ని, జలం, షట్ కృత్తికల శక్తిని(నక్షత్రశక్తి) ధరించి, చివరకు బ్రహ్మతపో నిర్మితమైన అలౌకిక మహాగ్ని శరవణంలో (అగ్నితో కూడిన రెల్లుతుప్పు) బాలుడిగా రూపుదిద్దుకుంది. అందుకే స్వామి శరవణభవుడు.

    శరవణభవ అనే పదంలో ఒక్కో అక్షరానికి ఒక్కో ప్రత్యేకమైన అర్థం ఉంది. శ - శమింపజేయువాడు, ర - రతి పుష్టిని ఇచ్చువాడు, వ - వంధ్యత్వం రూపుమాపువాడు, ణ - రణమున జయాన్నిచ్చేవాడు, భ - భవసాగరాన్ని దాటించే వాడు, వ - వందనీయుడు అని ఈ పదాలకు అర్థం.

    బీజాక్షర పరంగా చూస్తే, శ - లక్ష్మీబీజం. దీనికి అధిదేవత శంకరుడు. ర - అగ్నిబీజం. దీనికి అధిదేవత అగ్ని, వ - అమృతబీజం. దీనికి అధిదేవత బలభద్రుడు. ణ - యక్ష బీజం. దీనికి అధిదేవత బలభద్రుడు. భ - అరుణబీజం. దీనికి అధిదేవత భద్రకాళీ దేవి. వ - అమృతబీజం. దీనికి అధిదేవత చంద్రుడు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">