విశాఖపట్నం: ఈ రోజు విశాఖ ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కె.కె రాజు ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ ఆనాటి నాయకుల త్యాగాల ఫలితంగానే నేడు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని, భారత రాజ్యాంగాన్ని రచించుకొన్నామని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధులను గుర్తు చేసుకొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, వార్డు అభ్యర్థులు, వార్డు అధ్యక్షులు, బి.సి కార్పొరేషన్ చైర్మన్ మరియు డైరెక్టర్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు, బూత్ కన్వీనర్లు, సభ్యులు,కార్యకర్తలు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.