పశ్చిమగోదావరి జిల్లా లో అంతు చిక్కనివ్యాధి పలువురికి అస్వస్థత

MEDIA POWER
0

దెందులూరు: అంతుచిక్కని వ్యాధితో  పశ్చిమగోదావరి జిల్లాను బెంబేలెత్తిస్తోంది. దెందులూరు మండలం కొత్తగూడెం శివారు కొమరేపల్లి గ్రామంలో అంతుచిక్కని వ్యాధి కారణంగా 24మంది అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి నుంచి పలువురు మూర్చ, కళ్లు తిరిగి పడిపోతున్నారని తెలుస్తోంది.  శుక్రవారం ఉదయం పెద్ద సంఖ్యలో ఈ వ్యాధిబారిన పడడంతో   వారిని  అధికారులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి, కలెక్టర్‌ రేవు ముత్యాల రాజు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిణి సునంద, ఇతర అధికారులు హుటాహుటిన గ్రామానికి తరలివచ్చి  పరిస్థితిని అదుపుచేసేందుకు కృషిచేస్తున్నారు.   బాధితులను 108 వాహనంలో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అత్యవసరంగా గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారుల ఆదేశాల మేరకు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడంతోపాటు ఇంటింటికీ తిరిగి సర్వే చేపడుతున్నారు. 



Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">