విశాఖపట్నం: గణతంత్ర దినోత్సవం
సందర్భంగా ఈ నెల 26న జరిగే వేడుకలకు పోలీస్ పెరేడ్ మైదానంలో పక్కాగా
ఏర్పాట్లు చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి
అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో
వివిధ శాఖలకు చెందిన అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కలెక్టర్ వి.వినయ్‌చంద్ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని
ఆవిష్కరిస్తారని, కార్యక్రమం సజావుగా సాగేందుకు అధికారులంతా సమన్వయంతో పని
చేయాలన్నారు. సమావేశంలో జేసీ ఆర్.గోవిందరావు, ఎస్‌డీసీ రంగయ్య, డీఆర్వో
ఎ.ప్రసాద్, ఏవో రామ్మోహన్‌రావు, పౌర సరఫరాల శాఖ అధికారులు శివప్రసాద్,
నిర్మలాభాయి, సీపీఓ ప్రకాష్‌రావు, జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ, ఇతర శాఖలకు
చెందిన అధికారులు పాల్గొన్నారు.
Post a Comment
0Comments
3/related/default