ఆపరేషన్ టెంపుల్స్ డిమాలిషన్’కు స్కెచ్ వేసి..అడ్డంగా బుక్కైన బాబు
January 18, 2021
0
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో విగ్రహాల ధ్వంసంపై టీడీపీ అధ్యక్షుడు
చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు
చేశారు. ‘ఆపరేషన్ టెంపుల్స్ డిమాలిషన్’కు స్కెచ్ వేసిన చంద్రబాబు
దొరికిపోయాడంటూ ట్విటర్ వేదికగా ఆరోపించారు. 'అధికారంలో
లేనప్పుడు విద్వేషాలు రెచ్చగొట్టడం బాబుకు అలవాటే. గతంలో బంద్‌లు, నిరసనలకు
పిలుపు ఇచ్చినప్పుడల్లా ఎన్ని బస్సులు తగలబెట్టాలో జిల్లాల వారిగా
టార్గెట్లు ఇచ్చేవాడని సొంత మనుషులే బయటపెట్టారు. ఇప్పుడు ‘ఆపరేషన్
టెంపుల్స్ డిమాలిషన్’కు సేమ్ స్కెచ్ వేసి అడ్డంగా దొరికిపోయారని'
విజయసాయిరెడ్డి మండిపడ్డారు. 'మాలోకాన్ని అందరికీ
ఆమోదయోగ్యుడిగా తీర్చిదిద్దాలంటే ప్రజలకు మేలు చేసే పనులు చేయాలి. వాళ్ల
మనసులు గెలవాలి. విగ్రహాలను ధ్వంసం చేసి ప్రజల మధ్య అడ్డు గోడలు కడితే
పోలీసులకు దొరికిపోతారు. తండ్రీకొడుకులిద్దరూ రాజకీయంగా గల్లంతవుతారని' ఆయన
హెచ్చరించారు.
Tags