చీడికాడ : విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం పెద్ద నందిపల్లి ప్రాంతంలో జూదమాడుతున్న 65 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రాంతంలో పేకాట నిర్వహిస్తున్న పక్కా సమాచారం ఉండడంతో పేకాట శిబిరంపై పోలీసులు శనివారం అర్ధరాత్రి ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడులలో జూదమాడుతున్న 65 మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారి నుంచి రూ.5,58,611నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా విశాఖనగరం లోని పెందుర్తి, సుజాతనగర్ ప్రాంతాల వాసులుగా గుర్తించినట్లు ఎస్సై పి.సింహాచలం తెలిపారు. వీరిని కోర్టుకి హాజరు పరుస్తామని ఆయన వెల్లడించారు. (మనోభావాలకు విలువలు ఇచ్చే ఉద్దేశంతో ఫోటోలను జతచేయలేక పోతున్నాము )
Post a Comment
0Comments
3/related/default