కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ విజయవంతం. ...పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

MEDIA POWER
0



*ఎటువంటి అనుమానాలు వద్దు

*ముఖ్యమంత్రి ముందుచూపుతో కరోనా కట్టడి చేశారు

*అందరికీ ఉచితంగానే వ్యాక్సిన్

విశాఖపట్నం: జిల్లాలో కరోనా వ్యాక్సిన్  ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతున్నదని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్) ఆసుపత్రిలో కరోనా టీకాలు  వేసే కేంద్రాన్ని సందర్శించారు.   ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ అన్నది రాష్ట్రంలోనే కాక మొత్తం దేశ చరిత్రలోనే గొప్ప పరిణామమని తెలిపారు.  తమది  చేతల ప్రభుత్వమని అనవసర ఆర్భాటాలకు పోకుండా వేక్సినేషన్ ప్రారంభించడం జరిగిందన్నారు. ముందుగా వైద్య సిబ్బంది అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని తరువాత పారిశుధ్య, పోలీస్ సిబ్బందికి వేక్సిన్ వేస్తారని తెలిపారు. ప్రజలు ఎటువంటి అనుమానాలకు తావివ్వరాదన్నారు.  అంతకు ముందు మంత్రి ఆసుపత్రిలో వేక్సిన్ ఎంత వచ్చినది,  ఎంతమందికి టీకాలు వేస్తున్నదీ, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అక్కడి వైద్యులను, వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అక్కడ జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం గూర్చి విమ్స్ డైరెక్టర్ డాక్టర్ సత్య వరప్రసాద్ మంత్రికి వివరించారు. ఇంకా వేక్సిన్ ఏ విధంగా వేస్తున్నది మంత్రి పరిశీలించారు. వేక్సిన్ వేసిన తర్వాత ఎలావుందన్న విషయాన్ని వ్యాక్సిన్ వేసుకున్న ఎమ్.ఎన్.వో. ఎమ్. రాజబాబు, ఎఫ్.ఎన్.వో. సిరిపురపు గౌరిలను అడుగగా ఎటువంటి ఇబ్బందులు కలుగ లేదని, ఉత్సాహంగానే వుందని వారు మంత్రికి చెప్పారు.  కరోనా మహమ్మారి ఎంతో భయంకరంగా ప్రారంభమైందని, ఏమి చేయాలో పాలుపోని స్థితి నుండి వైద్యనిపుణుల సలహాల ప్రకారం లాక్ డౌన్ లు విధించారని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ముందు చూపుతో వివేకంతో  ముందస్తు చర్యలను తీసుకొని కరోనా మహమ్మారిని కట్టడి చేయగలిగారన్నారు ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం పరిచారన్నారు. కరోనా టెస్టులు చేయడం, ప్రజలందరికీ అవగాహన కల్పించడం అందరికీ అందుబాటులోకి వైద్యం తీసుకురావడం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టరు పి.అరుణ్ కుమార్, జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సూర్యనారాయణ, ఆర్డీవో కె.పెంచల కిషోర్, కె.కె.రాజు, కోలా గురువులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">