మంచి కథ అనుకున్నప్పుడు ఈ భాషనుండైనా తెలుగులోకి దిగుమతి అవుతుంటాయి. కన్నడంలో ‘కావలుధారి’గా తెరకెక్కి విజయకేతనం ఎగరేసిన థ్రిల్లర్ చిత్రం తెలుగులో ‘కపటధారి’గా రీమేక్ అయ్యి ఈ నెల 19న విడుదలకు సిద్ధం అవుతోంది. కథాబలమున్న చిత్రాలు మాత్రమే చేసే సుమంత్ కథానాయకుడిగా నటించడంతోపాటు చిత్ర ప్రచారంలో ఆసక్తి రేకెత్తించే అంశాలు ఉండడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి చిత్రం ఎలా ఉంది? పోలీస్ ఆఫీసర్‌గా సుమంత్ ఎలా నటించాడు? కదా కధనం ఇలావున్నాయి, అసలు చిత్రంలో హీరో ఏ కేసును ఛేదించాడు? అన్న విషయాన్ని వెండితెరపై చూడడమే సమంజసం. ఎందుకంటే ఒకొక్క ప్రేక్షకుడి ఆలోచనా ఒకొక్క రీతిలో ఉంటుంది. దీనిలో ఎంతమంది చిత్రాన్ని డైరెక్టర్ పాయింట్ అఫ్ వ్యూ లో ఆలోచించారు అన్న విషయం వ్యక్తంఔతుంది. అందుకే మా ఆలోచనలను ప్రేక్షకులపై రుద్దదలచుకోలేదు. క్రియేటివ్ ఎంటర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి లలిత ధనుంజయన్ నిర్మాతగా, ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం, సైమన్ కె.కింగ్ సంగీతం, ప్రవీణ్ కె.ఎల్ కూర్పు, బాషా శ్రీ మాటలు, హేమంత్ ఎం.రావు కథ, మరియు డా.జి.ధనంజయన్ స్క్రీన్ ప్లే లను నిర్వహిస్తున్నారు.