క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించిన : పద్మావతి

MEDIA POWER
0

విశాఖపట్నం: నేడు ప్రపంచ కేన్సర్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కళింగ వెల్ఫేర అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి బెందాళం పద్మావతి కాన్సర్ పట్ల అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎవరికైనా సరే క్యాన్సర్ సోకింది అంటే అందుకు కారణం వారి శరీర కణాలు శక్తిమంతంగా లేకపోవడమేనని, కణాలు గట్టిగా ఉండాలంటే ముందు మన మనస్సుని మంచి ఆలోచనలతో ఉంచాలని అన్నారు.  మన ఆలోచనలు తీరును బట్టే మన శరీర కణాలు స్పందిస్తాయని,  మనలో చెడు ఆలోచనలు, పగ, ప్రతీకారాలు, ద్వేషాలు వంటివి పెరిగితే  ఆ ఒత్తిడికి మన శరీరం మొత్తం చెడిపోతుందని, కణాలన్నీ  ఆగ్రహావేశాలతో రగిలిపోతూ శరీరం పాడైపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అని ఆమె తెలిపారు . అదే సమయంలో  జాలి ,కనికరం, మానవత్వం, దయాగుణం , పంచేగుణం ,మెచ్చుకునే గుణం వంటివి మనలో పెరిగితే అప్పుడు మన మనస్సు ఎంతో ఆహ్లాదంగా మారుతుందని, తద్వారా మన ఆరోగ్యం మెరుగై, కణాలన్నీ ఉత్తేజంగా మారి క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా బలంగా తయారవుతాయని క్యాన్సర్ ట్రీట్మెంట్  ఫెసిలిటీస్ అఫ్ అమెరికా పరిశోధకులు చెబుతున్నారని పద్మావతి చెప్పారు. మనలో ప్రతీకార జ్వాలలు, స్వార్ధాలు పెరిగినప్పుడు మన శరీరానికి హాని చేసే  కార్డీ స్టాల్,అడ్రినలిన్ రసాయనాలు ఎక్కువగా రిలీజ్  అవడం వలన మంచి కణాల సంఖ్య తగ్గిపోతుంది అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని, మనకు ఎవరైనా బాధ కలిగిస్తే వారిని పదే పదే తలుచుకుంటూ  రగిలి పోవడం కంటే అలా జాలి తలస్తే , మనసులో ఉన్న ఒత్తిడి మొత్తం దిగిపోయి.....  శరీరంలో కణాలన్నీ ఆహ్లాదకరంగా మారి.... రోగాల్ని ఎదుర్కొనేందుకు  శక్తివంతంగా మారుతాయని శాస్త్రవేత్తలు చూస్తున్నారని ఆమె చెప్పారు. అంతే కాకుండా మన సహనాన్ని పెంచుకోవాలని ,గతం గతమే ....దాన్ని మార్చలేము అనే ఆలోచనతో అలవరచుకోవడం ద్వారా క్యాన్సర్ లాంటి వ్యాధులను దూరం చేయగలమని ఆమె తెలిపారు. ట్రీట్మెంట్ కోసం లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, విదేశాలకు వెళ్లి ...అత్యంత మెరుగైన ట్రీట్మెంట్ తీసుకున్న.... చాలా మంది చనిపోతున్నారు అని అన్నారు. అలాంటి వ్యాధి సోకకుండా చేసుకుంటే ఎంతో మేలు. సహనంగా, సంతోషంగా, ప్రశాంతంగా, క్షమాగుణంతో  మెలగడమే చక్కని పరిష్కారమని పద్మావతి తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">