ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.... విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రేవేటికరణ నిర్ణయం ప్రజా వ్యతిరేకమని అన్నారు. అనేక మంది ప్రాణ త్యాగాలు ఫలితంగా నగరానికి పరిశ్రమ వచ్చిందని గుర్తుచేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రాష్ట్రానికే తలమానికమని విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం వివరంగా ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాసారని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రజలు ఆస్థిఅని దీనిని ప్రేవేటు పరం చేసే హక్కు ఎవరికి లేదని తెలిపారు. మన వంతు అన్ని ప్రయత్నాలు చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాలని, పరిశ్రమను ప్రెవేటు పరం చేస్తే ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారేప్రమాదముందని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ ను లాభాల బాటలో నడిపించడానికి కేంద్రం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి కానీ ప్రయివేటీకరణ సరియైన మార్గం కాదనని హితబోధ చేసారు.
మంత్రి అవంతి మాట్లాడుతూ....... స్టీల్ ప్లాంట్ అనేది జాతీయ సంపద. దీనిని ప్రేవేటు పరం చేసే హక్కు ప్రధాన మోడీకి లేదని అన్నారు. కేంద్రం మెడలు వంచి స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకోవాలని పిలుపు నిచ్చారు. ముఖ్యమంత్రి జగన్ దృష్టికి స్టీల్ ప్లాంట్ విషయం తీసుకువెల్లగానే తక్షణమే స్పందించి ప్రధాన మోదీకి లేఖ రాశారాణి తెలిపారు. ఇప్పటి వరకు కేంద్రం విభజన హామీలను నెరవేర్చకపోగా ప్రయివేటీకరణకు పాల్పడడం దారుణమన్నారు. టీడీపీ నాయకులు స్టీల్ ప్లాంట్ వ్యవహారం పై బురద జల్లే కార్యక్రమం అత్యంత ఏహ్యమైన చర్యని అన్నారు. పదవులకు రాజీనామా చేస్తే పార్లమెంట్లో గళం వినిపించలేమని అన్నారు. బీజేపీ చేసే దుర్మార్గాలని క్షేత్ర స్థాయి లోకి తీసుకు వెళ్ళాలి కానీ రాజీనామాలు చేసి పారిపోవడం ఈ సమస్యకు పరిష్కరం కాదన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి ఎమ్మెల్యే కి బాసటగా పార్లమెంటు సభ్యులు విజయ సాయిరెడ్డి, ఎం.వీ.వీ. సత్యనారాయణ మంత్రి అవంతి శ్రీనివాసరావు, వైస్సార్సీపీ సిటీ ప్రెసిడెంట్ వంశీకృష్ణ, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి , నార్త్ ఇంచార్జి కె.కె రాజు , మాజీ అధికార ప్రతినిధి జాన్ వెస్లీ, ఏపీ కళింగ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ బెందాళం పద్మావతి, స్టేట్ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, సిటీ మహిళా ప్రెసిడెంట్ గరికిన గౌరి, వార్డ్ ప్రెసిడెంట్స్,కార్పోరేటర్ అభ్యర్థులు, వైసీపీ సీనియర్ నాయకులు, వైసీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు, బూత్ అధ్యక్షులు,కార్యకర్తలు వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.