నామినేషన్ ప్రక్రియ, పోలింగ్ సెంటర్లను పరిశీలించిన నర్సీపట్నం డెప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆధారిటీఆఫీసర్ సబ్ కలెక్టర్ ఎన్ మౌర్య

MEDIA POWER
0

నర్సీపట్నం: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ లో భాగంగా నర్సీపట్నం డివిజన్ పరిధిలో పోలింగ్, నామినేషన్ సెంటర్లను  మంగళవారం నర్సీపట్నం డెప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆధారిటీ ఆఫీసర్,సబ్ కలెక్టర్ ఎన్ మౌర్య పరిశీలించారు.  నేటి నుండి   4వతేదీ వరకు రెండవ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైన నేపథ్యంలో నర్సీపట్నం డివిజన్ పరిధిలో పోలింగ్, నామినేషన్ సెంటర్లను  మంగళవారం నర్సీపట్నం డెప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆధారిటీ ఆఫీసర్,సబ్ కలెక్టర్ ఎన్ మౌర్య  పరిశీలించారు. మాకవరపాలెం మండలం శెట్టిపాలెం, రాచపల్లి, నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామ పంచాయితీల్లో పోలింగ్ కేంద్రాలను  సందర్శించి అక్కడ జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను  ఎన్నికల రిటర్నింగ్ అధికారి, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై  పూర్తి అవగాహనతో ఉండాలని సూచించారు.  నామినేషన్ లు దాఖలు చేసే అభ్యర్దులు  నేటి  నుండి ఆఖరి రోజైన 4వతేదీ చివరి నిముషం (5గంల వరకూ) అభ్యర్ధులు  నామినేషన్లను దాఖలు చేయడానికి  అవకాశం ఇవ్వాలని ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదే విధంగా  ఎన్నికల ప్రవర్తనా నియమావళికి  సంబంధించి అభ్యర్దులకు ఎటువంటి సందేహాలు వున్నా ఫిర్యాదు చేయాలన్నా  సబ్ కలెక్టరు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూము ఫోన్ నెంబర్లు7731803255, 8465013255   ఫోన్ చేసి సమస్యలను నివృత్తి చేసుకోవాలని తెలిపారు.   ఈ పర్యటనలో  ఎంపీడీవో అరుణ శ్రీ, తాసిల్దార్ రాణి అమ్మాజీ, ఎంసీసి టీమ్స్ పాల్గొన్నాయి. 


Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">