ముగిసిన రెండో విడత ‘పంచాయతీ’ పోలింగ్‌

MEDIA POWER
0

 అమరావతి :   ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులుదీరారు. ఉదయం 6 గంటల 30 నిమిషాలకు పోలింగ్‌ ప్రారంభంకాగా ఆరంభంలో కాస్త మందకొడిగా సాగింది. 10 గంటల తరువాత పోలింగ్‌ ఊపందుకుంది. వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ సరళిని అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించారు. నక్సల్స్‌ ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో ఒంటిగంట 30 నిమిషాల వరకే పోలింగ్‌ నిర్వహించారు. అనంతరం పోలీసుల భద్రత నడుమ బ్యాలెట్‌ బాక్సులను కౌంటింగ్‌ కేంద్రాలకు తరలించారు.

మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల వరకు 76.11 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు పోలింగ్‌ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా రెండోవిడత  13 జిల్లాలోని 167 మండలాల్లోని 3,328 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  వీటిలో అన్ని జిల్లాల్లోని 539 పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగిలిన 2,786 పంచాయతీలకు ఇవాళ పోలింగ్‌ నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మరికాసేపట్లో తుది ఫలితం వెలువడే అవకాశముంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">