పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలను ఆకస్మిక తనిఖీ చేసిన నర్సీపట్నం డెప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆధారిటీ ఆఫీసర్, సబ్ కలెక్టర్ఎన్ మౌర్య.

MEDIA POWER
0

గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నర్సీపట్నం డివిజన్ పరిధిలో ఉన్న  పోలింగ్, మరియు  నామినేషన్ సెంటర్లను బుధవారం  నర్సీపట్నం డెప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆధారిటీ ఆఫీసర్, సబ్ కలెక్టర్ ఎన్ మౌర్య ఆకస్మిక తనిఖీ చేశారు. 2వ తేదీ నుండి 4వతేదీ వరకు రెండవ విడత జరగనున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో ఎస్ రాయవరం మండలంలోని పెద్ద గుమ్ములూరు, నక్కపల్లి మండలం వెంపాడు, పాయకరావుపేట మండలం నామవరం, నాతవరం మండలం గన్నవరం, మన్యపు రాట్ల  గ్రామ పంచాయితీ ల్లో పోలింగ్ కేంద్రాలను  సందర్శించి , అక్కడ నామినేషన్ల ప్రక్రియ ను పరిశీలించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సిబ్బంది తో మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరిస్తూ   సిబ్బంది ఒకరికి ఒకరు  సమన్వయంతో పనిచేయాలన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ ఆయా మండలాలలో ఏర్పాటు చేసిన చెక్  పోస్టులను తనిఖీ చేసి సిబ్బందికి తగు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టరు మాట్లాడుతూ నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్దులు 4వతేదీ ఆఖరి రోజనీ కానీ అభ్యర్ధులు వారి నామినేషన్లను దాఖలు చేయడానికి  చివరి రోజు ఆఖరి నిముషం 5గంల వరకూ ఆలస్యం చేయకుండా వీలైనంత వేగంగా నామినేషన్లను  దాఖలు చేయాలని సూచించారు. అదే విధంగా అభ్యర్దులు ఎటువంటి ఒత్తిడులకు, భయాందోళనకు గురికావద్దని ధైర్యంగా నామినేషన్లను దాఖలు చేయాలన్నారు . ఎక్కడ ఎటువంటి సమస్య ఎదురైనా, ఎన్నికల ప్రవర్తనా నియమావళి కి  సంబంధించి ఎటువంటి సందేహం వచ్చినా, ఫిర్యాదు చేయాలన్నా  సబ్ కలెక్టరు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నెంబర్లు - 7731803255, 8465013255  నంబర్లకు ఫోన్ చేసి సమస్యలను నివృత్తి చేసుకోవాలన్నారు. పర్యటనలో  సంబంధిత మండల ఎంపీడీవో లు, తాసిల్దార్ లు, రిటర్నింగ్ అధికారులు ,తదితరులు పాల్గొన్నారు. 
                                                                       - డివిజనల్ పౌరసంబంధాల అధికారి, నర్సీపట్నం వారి సౌజన్యంతో 

                                                                                                              

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">