ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌తో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ సమావేశమయ్యారు. విజయవాడలోని ఎస్‌ఈసీ కార్యాలయంలో గురువారం అరగంటకు పైగా సమావేశం జరిగింది. తొలిదశ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా జరిపినందుకు సీఎస్, డీజీపీకి ఎస్ఈసీ అభినందనలు తెలిపారు. రెండు, మూడు, నాలుగో దశ ఎన్నికల్లో తీసుకోవాల్సిన చర్యలపై నిమ్మగడ్డ చర్చించారు. ఎన్నికల ఏర్పాట్లు, భద్రతా అంశాలు, ఉద్యోగుల సమస్యలు పరిష్కారంపై సమీక్షించారు. రానున్న విడతల్లో ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్ఈసీ ఆదేశించారు.
తొలిదశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం సీఎస్, డీజీపీని అభినందించిన ఎస్ఈసీ
February 11, 2021
0
Tags