పోలింగ్ కు అన్ని ఏర్పాట్లతో సిద్దంగా ఉండాలి .... జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధారిటి వి. వినయ్ చంద్

MEDIA POWER
0


విశాఖపట్నం,ఫిబ్రవరి - 7ః అన్ని ఏర్పాట్లతో పోలింగ్ కు సిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధారిటి వి. వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు.  అనకాపల్లి డివిజన్కు సంబంధించి ఆయా నియోజక వర్గాల ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, తహసిల్థార్, ఎంపిడిఓలతో పోలింగ్ ఏర్పాట్లపై ఆయన ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్కు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  ప్రతి మండలంలోని ఎంపిడిఓలు, మండల స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు.  పోలింగ్ సిబ్బంది ఉదయం 6 గంటలకే పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని ఆదేశించారు.  ప్రతి రిటర్నింగ్ అధికారి, ప్రిసైడింగ్ అధికారులతో సిబ్బందితో సమీక్షించుకోవాలన్నారు.  పోలింగ్ మెటీరియల్ జాగ్రత్తగా చూసుకోవాలని, ఆరోగ్య సమస్యలు ఉంటే అందుబాటులోని 108, 104 వాహనాలను వినియోగించుకోవాలని, కోవిడ్ మెటీరియల్ అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.  పోలింగ్ కేంద్రాల వారీగ మెటీరియల్ పెట్టుకోవాలని, రవాణా వాహనాలు సిద్దం చేసుకోవాలని వివరించారు.  భోజన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.  పోలింగ్ పూర్తి అయ్యేంతవరకు రిజర్వ్ సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఏ విధమైన తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్థుల ఖర్చులను ఎప్పటికప్పుడు రికార్డు చేయాలని, పోస్టర్లు, ప్రలోబాలు, తదితరమైనవి లేకుండా చూసుకోవాలని చెప్పారు. తహసిల్థార్లు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ని పటిష్టంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. విద్యుత్, అంతరాయం లేకుండా చూసుకోవాలని, మరుగుదొడ్లు, త్రాగునీరు, వంటి అత్యవసరాలను  చూసుకోవాలని తెలిపారు.  అభ్యర్థుల జాబితా ప్రదర్శన, తదితరమైనవి మండల ప్రత్యేక అధికారులు, ఎంపడిఓలు చూసుకోవాలనితెలిపారు.  పోలింగ్ సిబ్బంది తప్పనిసరిగా, సమయానికి హాజరు కావాలని, హాజరు కాకపోతే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. రవాణా సౌకర్యార్ధం  ఆర్టిసి బస్సులే కాకుండా  అదనంగా వాహనాలు ఉంటాయని, వాటిని అవసరానికి వినియోగించుకోవచ్చునని తెలియజేసారు.  మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడిఓలు మండల స్థాయిలో రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. రిసెప్షన్ కేంద్రాలకు పోలింగ్ అయిన మెటీరియల్ తర్వాత పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాతే సిబ్బందిని పంపాలన్నారు. ఆర్.ఓ.లు అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.  కౌంటింగ్ లో తప్పిదాలు జరగకుండా చూసుకోవాలన్నారు.  కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత బ్యాలెట్ పత్రాలను సబ్ ట్రజరీలో భద్రపరచాలన్నారు.  బస్సులను గుర్తించే విధంగా స్టిక్కర్లు, సంఖ్యను వేయాలని చెప్పారు.  కౌంటింగుకు సంబంధించి పలు సూచనలు చేశారు.  పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్లలోపు ఇతరులు ఎవరూ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు ఎన్నికల సిబ్బందితో పాటు బస్సులలో ప్రయాణించాలని చెప్పారు.  పోలింగ్, కౌంటింగ్, ఫలితాల వెల్లడి, బ్యాలెట్ పత్రాలను సబ్ ట్రజరీలో భద్రపరిచే వరకు ప్రతి విషయంలోను స్పష్టతతో నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలన్నారు.  పోలింగ్ 44 గంటల ముందు నుండి ప్రచారాలు జరుగరాదని, దీన్ని పరిశీలించాలని, డబ్బు, మద్యం పంపిణీలు జరుగకుండా తహసిల్థార్లు, ఇన్ స్పెక్టర్లు పరిశీలించాలని పేర్కొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్-1 ఎం. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పోలింగ్ సిబ్బంది, పోలింకు కేంద్రాలు సరిపోయిన సిబ్బంది శిక్షణ ఇవ్వడమైనదన్నారు.  సిబ్బంది హాజరు తీసుకోవాలని తెలిపారు.   పోలింగ్ మెటీరియల్ ఇప్పటికే మండలాకు సరఫరా చేయడమైనదని,  సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో సూక్ష్మ పరిశీలకులు ఉంటారని, మాక్ పోలింగ్ చేసినపుడు వీడియో తీయాలని చెప్పారు.   జిల్లా జాయింట్ కలెక్టర్-2 పి. అరుణ్ బాబు మాట్లాడుతూ పోలింగ్ సిబ్బంది, మెటీరియల్ తీసుకువెల్లేందుకు 304 ఆర్.టి.సి. బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  బస్సులు వెళ్లని ప్రాంతాలకు టాటా మ్యాజిక్ లు ఏర్పాటు చేయడమైనదని, ప్రతి మండలానికి అదనంగా వాహనాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.  అవసరాన్ని బట్టి వాటిని వినియోగించుకోవాలన్నారు.   వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా జాయింట్ కలెక్టర్-3 ఆర్. గోవిందరావు, డిఆర్ఓ ఎ. ప్రసాద్, డిఆర్డిఎ పిడి వి. విశ్వేశ్వరరావు, జడ్పి సిఇఓ నాగార్జున సాగర్, డిపిఓ కృష్ణ కుమారి, వ్యవసాయశాఖ జెడి లీలావతి, సాంఘిక సంక్షేమ శాఖ జెడి డి.వి. రమణమూర్తి, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ ఉప కమీషనర్ టి. శ్రీనివాసరావు, డిఇఓ లింగేశ్వర్ రెడ్డి, ఎస్ఎస్ఎ పిఒ మళ్లిఖార్జున రెడ్డి, ఎపిఐఐసి జిఎం రామలింగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">