మైక్రో అబ్జర్వర్లు నిష్పక్షపాతంగా, నిర్భయంగా విధులు నిర్వహించండి

MEDIA POWER
0

ఎన్నికల ప్రక్రియ పై విశ్వసనీయత పెరిగేలా విధులు నిర్వహించండి

మైక్రో అబ్జర్వర్లను కోరిన గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు ప్రవీణ్ కుమార్ . 

విశాఖపట్నం : గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా మైక్రో అబ్జర్వర్లు నిష్పక్షపాతంగా, నిర్భయంగా విధులు నిర్వహించాలని  ఎన్నికల సాధారణ పరిశీలకులు ప్రవీణ్ కుమార్ తెలిపారు. గురువారం నాడు స్థానిక విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో సూక్ష్మ పరిశీలకులుగా నియమితులైన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల ప్రక్రియను నిశితంగా గమనించే బాధ్యతను మైక్రో అబ్జర్వర్లపై ఉంచిందని తెలిపారు. సర్పంచ్, వార్డు సభ్యుల కోసం పోలింగ్, ఓట్ల లెక్కింపు,  అనంతరం ఉప సర్పంచ్ ఎన్నికను జాగ్రత్తగా పరిశీలించాలని అన్నారు.  రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం జారీ చేసిన నియమ, నిబంధనలను, రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారుల హ్యాండ్ బుక్ లను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని తెలిపారు.  నియమ, నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా జరిగితే, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని, ఆయా లోపాలను తమ నివేదిక లో పొందుపరచాలని కోరారు. అంతకుముందు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి నాగార్జున సాగర్ నియమ‌ నిబంధనలను వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">