అదిరిపోయే ఫీచర్‌తో టెక్నో ఫాంటమ్ ఎక్స్2!

MEDIA POWER
0

 

కొత్తగా ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే మీకు శుభవార్త. అదిరిపోయే ఫీచర్‌తో స్మార్ట్‌ఫోన్ ఒకటి మార్కెట్‌లోకి వచ్చింది. అదే టెక్నో ఫాంటమ్ ఎక్స్2!

ఈ స్మార్ట్ ఫోన్ లో  ఇదివరకు ఏ ఫోన్‌లో చూడని అదిరిపోయే ఫీచర్ ఉన్నాయి.  దీనిలో ప్రధానంగా ఫోర్ రియర్ కెమెరా లెన్స్ ముందుకు వచ్చి మళ్లీ లోపలికి వెళ్తాయి. ఒప్పో వంటి కంపెనీలు గతంలో సెల్ఫీ కెమెరాకు ఇలాంటి ఫీచర్‌ను ఉపయోగించాయి. కెమెరా ఫోన్‌ నుంచిపైకి వచ్చి మళ్లీ లోపలిక వెళ్లేది. అయితే ఈసారి ఇప్పుడు మార్కెట్‌లోకి వచ్చిన ఫోన్‌లో వెనుక భాగంలోని కెమెరా లెన్స్ ముందుకు వచ్చి లోనికి వెళ్తుంది.  అంటే డీఎస్ఎల్ఆర్‌ కెమెరా మాదిరి గా  అని చెప్పుకోవచ్చు.

టెక్నో కంపెనీ తాజాగా ఇలాంటి స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని పేరు ఫాంటమ్ ఎక్స్2, ఫాంటమ్ ఎక్స్ 2 ప్రో. ఈ రెండు ఫోన్లు ఇప్పుడు మార్కెట్‌లో లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్లలోని మెయిన్ ఫీచర్ కెమెరా. ఈ కెమెరా సాయంతో యూజర్లు మంచి పోట్రైట్  ఫోటోలు తీసుకోవచ్చు. 
అంతే కాకుండా ఈ రెండు ఫోన్లు 5జీ సపోర్ట్ చేస్తాయి. టెక్నో ఫాంటమ్ ఎక్స్2 ప్రో 5జీ ఫోన్ ధర రూ. 76,800 గా ఉంది. అలాగే టెక్నో ఫాంటమ్ ఎక్స్2 జీబీ రేటు దాదాపు రూ. 59,200 లు.  తొలిసరిగా గా ఈ ఫోన్ సౌదీ అరేబియాలో అందుబాటులోకి రానుంది. తర్వాత భారత్ సహా ఇతర ప్రాంతాల్లో ఈ నెల చివరి కల్లా అందుబాటులోకి రానుంది. 

ఫాంటమ్ ఎక్స్2 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 6.8 అంగుళాల స్క్రీన్, అమోలెడ్ డిస్ప్లే , 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, గొరిల్లా గ్లాస్, యూనీబాడీ డబుల్ కర్వ్‌డ్ బాడీ, టీయూవీ ఎస్‌యూడీ సర్టిఫికేషన్, హైపర్ ఇంజిన్ 5 వంటి ఫీచర్లు ఉన్నాయి. కెమెరా ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50 ఎంపీ, 50 ఎంపీ, 13 ఎంపీ కెమెరాలు ఉంటాయి. ముందు భాగంలో 32 ఎంపీ సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్‌లో 5160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 45 వాట్ చార్జింగ్ స్పీడ్ సపోర్ట్ చేస్తుంది. మీడియాటెక్ డిమెన్‌సిటీ 9000 5జీ చిప్ ఉంటుంది. 12 జీబీ ర్యామ్ ఉంచారు. ఇకపోతే ఫాంటమ్ ఎక్స్2 ఫోన్‌లో చూస్తే డిజైన్ ఒకే విధంగా ఉంటుంది. అయితే ఇందులో 8 జీబీ ర్యామ్ ఉంటుంది. కెమెరాలు కూడా 13 ఎంపీ, 2 ఎంపీ, 64 ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు భాగంలో 32 ఎంపీ కెమెరాను అమర్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">