65వ జాతీయ రైఫిల్ షూటింగ్ ఛాంపియన్ షిప్ లో మెరుగైన ప్రతిభ ... జాతీయ స్క్వాడ్ ట్రయల్స్ కు ఎంపిక

MEDIA POWER
0


మీడియా పవర్, కాకినాడ: కాకినాడకు చెందిన దాయం అక్షయి 65వ జాతీయ రైఫిల్ షూటింగ్ ఛాంపియన్ షిప్ లో మెరుగైన ప్రతిభ కనబరిచింది. దీనితో ఈమె జనవరిలో నెల జరగనున్న జాతీయ స్క్వాడ్ ట్రయల్స్ కు ఎంపికైంది. విజయవాడ లోని ది ఇండియన్ షూటింగ్ అకాడమి స్పోర్టులో శిక్షణ పొందుతూ ఈ నెలలో జరిగిన 65వ జాతీయ రైఫిల్ షూటింగ్ చాంపియన్స్ లో మెరుగైన ప్రతిభను కనబరచిన విషయం విదితమే. ఈమె కాకినాడ రమణయ్యపేటలో నివాసం ఉంటున్న దాయం రాజేష్ కుమార్తె . ఆశ్రమం పబ్లిక్ స్కూల్ లో 9 వ తరగతి చదువుకుంటున్న అక్షయి జాతీయ స్క్వాడ్ ట్రయల్స్ కు ఎంపిక కావడం తో ఆశ్రమ పబ్లిక్ స్కూల్ చైర్మన్ అభిషేక్ వర్మ డీన్ ఉమా మహేష్ మరియు ప్రిన్సిపల్ అగస్టీన్, మిగిలిన సిబ్బంది ఇచ్చిన ప్రోత్సాహం తోనే సాధ్యమైందని ఆమె తండ్రి రాజేష్ తెలిపారు. రైఫిల్ షూటింగులో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ 2023 జనవరిలో జరుగు జాతీయ స్క్వాడ్ ట్రయల్స్ కు ఎంపిక అయినందుకు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తపరుస్తున్నారు. జాతీయ స్క్వాడ్ ట్రయల్స్ కు ఎంపిక అయిన అక్షయి విజయ భేరి మ్రోగించి పాఠశాలకు, కాకినాడ పట్టణానికి, రాష్ట్రానికి భారతదేశానికీ గౌరవాన్ని ప్రతిష్టను మరింత ఇనుమడింప చేయాలని, రైఫిల్ షూటింగ్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహించాలని భారత్ అల్ టైం రైఫిల్ షూటర్లు అయిన అభినవ్ బింద్రా, గగన్ నారంగ్, అంజలి భగవత్, వాటి వారిని ఆదర్శంగా తీసుకుని  అక్షయి ఆ  స్థాయికి ఎదగాలని పబ్లిక్ స్కూల్ యాజమాన్యం, బంధువులు, మిత్రులు ఆకాంక్షించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">