విశాఖపట్నం, డిసెంబర్-28:- వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంస్థ చెల్లించవలసిన ఆస్తి పన్ను బకాయి రూ.3,41,47,156/-లకు చెక్కును అందజేసినట్లు జివిఎంసి కమిషనర్ పి రాజాబాబు వెల్లడించారు. ఆ సంస్థ ప్రతినిధులు బుధవారం ఈ మొత్తాన్ని జోనల్ కమిషనర్ ద్వారా జివిఎంసి కమిషనర్ కు అందజేశారాణి తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంస్థ 1086315588 అసెస్మెంట్ ఆస్తి పన్ను ఎరియర్స్ బకాయిలను చెల్లించారు. అనంతరం జివిఎంసి కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు ఆస్తి పన్నుల బకాయిలను జివిఎంసి కి స్వచ్ఛందంగా చెల్లించి నగారాభివృద్ధికి సహకరించవలసినదిగా కోరారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ డాక్టర్ వి సన్యాసి రావు, డిసి(రెవెన్యూ) ఫణిరాం, జోనల్ కమిషనర్ సింహాచలం, ఆర్వో శ్రీకాంత్, ఆర్.ఐ.లు శివ, శుభాన్ తదితరులు పాల్గొన్నారు.