స్వశక్తి సంపర్ణుడు....నేటి యువతరానికి ఆదర్శప్రాయుడు..

MEDIA POWER
1

కాకినాడ, మీడియాపవర్: విజయవాడ నిమ్రా కాలేజీలో బి.టెక్  ఏరోనాటికల్  ఇంజనీరింగ్ లో పట్టభద్రులు. తూర్పుగోదావరి జిల్లా  విరవాడ స్వగ్రామం.  మనిషి ఎంత ఎత్తు ఎదిగినా  ఒదిగి వుండే స్వభావం..   ఇంతకన్నా ఒక వ్యక్తికి ఇంకేమి కావాలి.. అనుకునే అభిమాన ఖాతాదారుల గళం ఆయనే నాము  నానాజీ.   కరోనా నేర్పిన పాఠాలను అవగాహన చేసుకున్న ఆయన దానిని నిలువరించేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నారు. అంతే కాదు అయన స్వశక్తితో పైకి ఎదగాలి అనుకున్నారు. నలుగురికి పనికల్పించాలి అని నమ్మిన సిద్ధాంతాన్ని అమలుచేసేందుకు అడుగులు వేశారు.  అయన ఆలోచనలకు కుటుంబ  సభ్యులు, మిత్రులు అనేక అనుమానాలను వ్యక్తం చేసినప్పటికీ వాటి అన్నిటికి పరిష్కారం  వెతికారు. చివరికి   ఆయన  వినాయక డ్రై   ఫ్రూట్స్ షోరూం తెరిచారు. డ్రై ఫ్రూట్స్ ఎందుకు తినాలి అన్న విషయంపై ప్రజలలో అవగాన కల్పించారు. కరోనా మహమ్మారి వంటి అంటువ్యాధుల నుండి  ఆరోగ్యమైన జీవితం  ప్రజలు గడిపేందుకు అడుగులు వేశారు. అనుక్షణం ప్రజల ఆరోగ్యాన్ని కాంక్షించే ఆయన ఎంత ఎత్తు ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండాలన్నది తన  తల్లి తండ్రులు నేర్పించారని సగర్వంగా చెప్పడం నేటి తరానికి అయన ఆదర్శమని తెలుస్తోంది.  

ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికీ తృణప్రాయంగా విడనాడారు.  కరోనా  సమయం లో ప్రజలు వ్యాధినిరోధక శక్తి లేక మృత్యువాత పడటాన్ని జీర్ణించుకోలేకపోయారు. వ్యాధినిరోధక శక్తిని పెంచే డైఫ్రూట్స్ వ్యాపారాన్ని ప్రారంభించడంలో  భార్య మరియు తల్లి సహాయ సహకారాలు మరువలేనివని మీడియా పవర్ తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి చలపతి తెలిపారు. జ్ఞాన మొక్కటి నిలిచివెలుగును అన్న గురజాడ మాటలు అక్షర సత్యాలు అని నిరూపించే విధంగా  డ్రై ఫ్రూట్ వ్యాపార విఫణిలో నాణ్యతలో రాజీ పడకుండా, అతితక్కువ ధరలకు సరుకును విక్రయిస్తున్నారన్న పేరును గడించారు.  సొంతం లాభం కొంత మానుకు  పొరుగు వారికి తోడు పడవోయ్ అన్న గురజాడ మాటలనూ  నిజం చేస్తున్న అయన స్వశక్తి సంపర్ణుడు....నేటి యువతరానికి ఆదర్శప్రాయుడు గా నిలుస్తారనడం అతిశయోక్తికాదేమో!  

Post a Comment

1Comments

Post a Comment
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">