" ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని "తూర్పుగోదావరి జిల్లా" కాకినాడ కి ఒక ప్రత్యేక స్థానం వుంది. అక్కడి ప్రజలు అధికారుల పట్ల చూపించే ఆదరాభిమానాలు, అందించే సహాయ సహకారాలు గుర్తించ తగినవి. ఇదే క్రమంలో సహాయ ఆహార నియంత్రణ అధికారి గా 2020 జనవరి 2 వ తేదిని విధులలో చేరిన శ్రీమాన్ "బుర్లా శ్రీనివాస్" అక్కడి ప్రజారోగ్యం పై దృష్టి సారించడమే కాకుండా వారిని చైతన్య పరుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నిధులు పెంచడం లో అగ్రస్థానంలో నిలుస్తున్నారు. ప్రజలు బయట తినేటప్పుడు రంగులు వేసిన ఆహార పదార్ధాలను, ఫ్రీజర్ లలో నిలువ ఉంచిన, నాసిరకం ఆహార పదార్ధాలను తినకూడదని సూచిస్తున్నారు. అయన ప్రజా శ్రేయస్సు కోరుకునే అధికారిగా చెప్పటానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేమికావాలి? చెప్పడమే కాకుండా దానిని అమలు చేసేందుకు అయన సిబ్బందితో సంసిద్ధమైనారు. ప్రజల నుండి పిర్యాదు అందితే చాలు వెంటనే స్పందిస్తూ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ... అక్రమ వ్యాపారుల పాలిట సింహ స్వప్నంగా నిలిచారు. అటువంటి అధికారితో నైతిక విలువలకు ప్రాధాన్యతను ఇస్తున్న "మీడియా పవర్ " తూర్పు గోదావరి జిల్లా బ్యూరో ఇంచార్జి ముఖా ముఖి.
అధికారి: నమస్తే.. చాల కాలానికి మీరు చెప్పిన విధానాన్ని బట్టి విలువలతో కూడిన జర్నలిస్ట్ ని చూస్తున్నాను. మంచి ఆదర్శాలతో స్థాపించిన మీ "మీడియా పవర్ " ఇంతింతై వటుడింతై అన్న రీతిని అభివృద్ధి కావాలని కోరుకుంటూ... మొదటిగా మీ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
మీడియా పవర్ ప్రతినిధి: సార్ ... మీరు కాకినాడలో ఎపుడు చేరారు? అసలు మీ విధులు విధానాలను మా పాఠకుల కోసం చెప్పరు .
అధికారి: తప్పకుండా చలపతి గారు. నేను కాకినాడ సహాయ ఆహార నియంత్రణ అధికారిగా 2020 జనవరి 2 న వచ్చాను. అధికారిగా వచ్చిన నాటి నుండి మా డిపార్ట్మెంట్ కి సంభందించి వస్తున్న ఫిర్యాదులపై తక్షణం చర్యలు తీసుకుంటున్నాము. కేసులు కడుతున్నాము. జరిమానాలు విదిస్తున్నాము.
మీడియా పవర్ ప్రతినిధి: ఎటువంటి వాటిపై ఎక్కువ పిర్యాదులు వస్తాయి? వచ్చిన ఫిర్యాదులపై నిర్ధారణ చేసుకునే విధానం,ఏఏ సెక్షన్ల మీద కేసులు కడతారు అన్న విషయాన్ని చెప్పారు?
అధికారి: తప్ప కుండా ... ముందుగా ప్రజలకు ఒక విషయం చెప్పాలి... హోటళ్ల లో ఆహార పదార్ధాలు తినేముందు రంగులు కలపని వాటిని మాత్రమే తినాలి. అలాగే ఫ్రీజ్ చేసిన ఆహారాన్ని సాధ్యమైనంత వరకు నివారించాలి. పాచిపోయిన ఆహారాన్ని గుర్తిస్తే మాకు తెలియచేయాలి. అప్పుడు మాత్రమే మేము నియంత్రించగలము. ప్రజలకు పౌష్టికాహారం, అందించేవిధంగా చర్యలు తీసుకోగలం .. ప్రజలు అనారోగ్యాలకు గురికాకుండా చూడగలం. పైవన్నీ సాధ్యపడాలంటే మాకు ప్రజలనుండి పిర్యాదులు అందలి మరి.
మీడియా పవర్ ప్రతినిధి: 2020 జనవరి నుండి ఇప్పటివరకు మీకు అందిన పిర్యాదులు ఎన్ని? శాంపిల్స్ ఎన్ని సేకరించి వుంటారు?
అధికారి: ఎప్పటి వరకు వచ్చిన ఫిర్యాదుల మేరకు సుమారు 168 శాంపిళ్లను సేకరించడం జరిగింది. వాటిలో ప్రాణాంతకమైన వాటిని గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది. నేను "మీడియా పవర్" ద్వారా పబ్లిక్ కి ఒక సూచన చేస్తున్నా ... ఆహారపదార్ధాలు, పానీయాలు అమ్ముతున్న వ్యాపారస్తులు విధిగా లైసెన్స్ తీసుకోవాలి. అలా తీసుకోకుండా దొరికినట్టయితే వారిపై క్రిమినల్ యాక్ట్సె సెక్షన్ 63 ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 5 లక్షల వరకు అపరాధ రుసుము వసూలు చేయబడుతుంది.
మీడియా పవర్ ప్రతినిధి: మీరు ఇక్కడ చేరడానికి ముందు ఆదాయం ...మీరు వచ్చిన తరువాత డిపార్టుమెంటుకి వచ్చిన ఆదాయం?
అధికారి: నేను కాకినాడ వచ్చిన సమయానికి ఆదాయం 60 లక్షలు ఉండేది. ప్రస్తుతం అది కోటిరూపాయలు పెరిగింది.
మీడియా పవర్ ప్రతినిధి: అసలు మీ డిపార్ట్మెంట్ కి ఆదాయ వనరులు ?
అధికారి: ప్రజల ఆహారపు అలవాట్లను అదునుగా చేసుకుని వ్యాపారం చేసే ప్రతి వ్యాపారస్తుడు విధిగా మా నియమ నిబంధనకు అనుసరిస్తూ లైసెన్స్ తీసుకోవాలి. లైసెన్సు తీసుకోకుండా చేసే వ్యాపారం చట్ట రీత్యా నేరం. ఆహార పదార్ధాలలో రంగులు కలుపరాదు. ఫ్రీజింగ్ చేయరాదు. అలా చేసిన వారిపై పిర్యాదులు వచినట్టైతే ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కేసులు కట్టడం జరుగుతుంది. ఆ సంస్థకు జరిమానా విధించడమే కాకుండా మూసివేయడం జరుగుతుంది. ఇప్పుడు మాసంస్థకు ఏ విధంగా ఆదాయం వస్తుంది అన్న విషయం తెలిసినట్టుంది అంటూ..... చిన్న చిరునవ్వు ....
మీడియా పవర్ ప్రతినిధి: చివరిగా మీరు ప్రజలకు ఆహారపు అలవాట్ల పై ఇచ్చే సూచన ?
అధికారి: మీకు ఎక్కడన్నా ఆహారంలో కల్తీ, పాచి పోయిన ఆహారం పెట్టినట్టు గుర్తించిన, అధికశాతంలో రంగులు కలిపినట్టు గుర్తించిన వెంటనే సహాయ ఆహార నియంత్రణశాఖ ఉందని గుర్తుంచుకొని అటువంటి వాటిపై పిర్యాదులు చేయాలని సూచన చేస్తూ. సెలవు. జై హింద్ .
మీడియా పవర్ ప్రతినిధి: మీ అత్యంత విలువైన సమయాన్ని మాతో కేటాయించి మా పాఠకులకు అనేక విషయాలపై అవగాహనా కల్పించిన మీకు ధన్యవాదాలు తెలుపుతూ.... సెలవు తీసుకున్నారు తూర్పుగోదావరి జిల్లా బ్యూరో ఇంచార్జి