కురుపాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన ...జిల్లా కలెక్టర్

MEDIA POWER
0


మీడియా పవర్, పార్వతీపురం/కురుపాం, డిసెంబరు 20 : జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కురుపాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేపట్టిన నాడు నేడు పనులను మంగళ వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనులు వేగవంతం చేసి అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఆహ్లాదకర వాతావరణం నెలకొల్పాలని సూచించారు.

పాఠాలు బోధించిన కలెక్టర్

నాడు నేడు పనులు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ విద్యార్ధుల ప్రమాణాలను పరిశీలించారు. పదవ తరగతి విద్యార్థుల వద్దకు వెళ్లి వారు నేర్చుకున్న అంశాలపై వారి అవగాహనను పరిశీలించారు. బోర్డుపై పాఠాలను బోధించారు. ఇష్టంతో చదవాలని విద్యార్థులకు హితవు పలికారు. ఉన్నత లక్ష్యాలను పెట్టుకోవాలని, వాటిని సాధించే వరకు పట్టు విడువరాదని సూచించారు. రానున్న పరీక్షలలో మంచి మార్కులు సాధించుటకు ఇప్పటి నుండే చక్కగా చదవాలని అన్నారు. సహజంగా పరీక్షలు అనగానే ఒక రకమైన ఒత్తిడి ఉంటుందని దానిని జయించాలంటే ప్రణాళికా సిద్ధం చేసుకోవాలని, ఇలా చేసుకోవడం వల్ల ఒత్తిడి ఉండదని, పరీక్షలు ఆత్మవిశ్వాసంతో రాయవచ్చని తెలిపారు. చదువుతో పేదరికాన్ని జయించవచ్చని, శ్రీమద్భగవద్గీత 5 వ అధ్యాయం లోని విద్యావినయ సంపర్ణం అన్న శ్లోకాన్ని విద్యార్థులకు తెలిపారు. జీవితాలను శోభాయమానంగా మలచుకోవాలని అందుకు ప్రతి అడుగు ప్రగతి దిశగా వేయాలని ఆయన సూచించారు. విద్యార్ధులకు కెరియర్ బాగుండాలి అనుకున్న అయన పలు ఉపయుక్తమైన అంశాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">