బురుజుపేట "కనక మహాలక్ష్మి" నివాసం

MEDIA POWER
0
విశాఖ రాజులపై దాడి చేయడానికి ప్రయత్నించిన శత్రు సైన్యం కోటలో ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి ఆలయాన్ని ధ్వంసం చేసి, దేవతను బావిలో వేశారన్నది ఇతిహాసం.

విశాఖపట్నం: పురాణ కథనం ప్రకారం, 1907 నాటి ఈ ఆలయ దేవత కొంతమంది భక్తులకు కలలో కనిపించి పైకప్పు లేకుండా తన విగ్రహాన్ని ప్రతిష్టించాలనే కోరికను తెలియజేసిందని చెప్తారు. ఆమె కోరిక మేరకు ఒకటవ పట్టణ ప్రాంతంలోని బురుజుపేటలోని శ్రీ కనకమహాలక్ష్మి ఆలయం గర్భగుడి లో పైకప్పు లేకుండానే భక్తులు స్వయంగా పూజలు, అభిషేకాలు చేస్తుంటారు. విగ్రహాన్ని బయటకు తీసిన బావిలో అష్ట లక్ష్మి విగ్రహాలు ఉన్నాయన్న ప్రచారము వుంది. 'స్థల పురాణం' ప్రకారం, మార్గమధ్యంలో ఉన్న ఆలయాన్ని ఒక మూలకు మార్చారని, దీనితో చాలా మంది ప్లేగు బారిన పడి ప్రాణాలు కోల్పోయారన్నది చరిత్ర చెబుతున్న మాట.  విగ్రహాన్ని మార్చడం వల్ల అకస్మాత్తుగా వ్యాధి ప్రబలుతోందని భయంతో స్థానికులు విగ్రహాన్ని యథాస్థానానికి తీసుకొచ్చారని, అనంతరం యదా స్థానానికి తేవడంతో అంటువ్యాధి  తగ్గి ప్రజలు సాధారణ జీవితాన్ని గడపడం ప్రారంభించారని చెప్తారు. బురుజుపేటలో సీతారామస్వామి, శ్రీ సత్యనారాయణ మరియు ఎమ్బర్‌మన్నార్ వేంకటేశ్వర స్వామి ఆలయాలు వంటి అనేక పురాతన దేవాలయాలు  ఉన్నప్పటికీ, శ్రీ కనక మహా లక్ష్మి అమ్మవారి ఆలయం మాత్రమే ప్రాముఖ్యతను సంతరించుకుకోవడం విశేషం.  “దేవత తమ కష్టాలను తొలగిస్తుందని మరియు వారి కోరికలను తీరుస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 23 వరకు జరిగే ‘మార్గశిర మాసోత్సవముల’ కోసం దేవస్థానం ముస్తాబవుతోంది. ఇప్పటికే జివిఎంసి, పోలీస్ శాఖలు భక్తుల సౌఖర్యార్ధం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.


x

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">