విశాఖపట్నం, జనవరి 24: జాతీయ ఎన్నికల సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని, 13వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పెషల్ సమారీ రివిజన్ - 2023 ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఉత్తమ విధానాలను అవలంబించిన అధికారులకు బెస్ట్ ఎలెక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు ప్రకటించింది. యువ ఓటర్ల నమోదు, చనిపోయిన, వలసవెళ్లిన ఓటర్ల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదులో యువత భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు మహిళల్లో ఓటరు నమోదుపై అవగాహన కల్పించడం, అణగారిన వర్గాలను ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తూ ఓటరు జాబితా సవరణ కార్యక్రమములు నిర్వహణలో ఉత్తమ ప్రతిభా పాఠవాలు కనబరిచిన జిల్లాలోని ఉత్తమ ఎన్నికల అధికారులకు బెస్ట్ ఎలెక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డులను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుంది. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి డా.ఎ.మల్లికార్జున ఈ అవార్డును, విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజక వర్గం ఎన్నికల నమోదు అధికారి డి. లక్ష్మారెడ్డి ఉత్తమ ఎన్నికల నమోదు అధికారి గానూ, గాజువాక పోలింగ్ కేంద్రం నెంబర్ 159 బూత్ లెవెల్ అధికారి గా సునీత ఈ నెల 25వ తేదీ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదికగా జరుగు జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ చేతుల మీదుగా అందుకోనున్నారు.
ఈ సందర్బంగా మంగళవారం ఉదయం కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ కె ఎస్ విశ్వనాథన్, డిఆర్వో ఎస్ శ్రీనివాస మూర్తి, ఆర్డీవో హుస్సేన్ సాహెబ్, సమాచార శాఖ జె.డి వి.మణిరామ్, కలెక్టరేట్ ఎలక్షన్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది తదితరులు జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లిఖార్జున ను అయన ఛాంబర్లో కలిసి అభినందనలు తెలియజేసారు.