ఏఐబిఈఏ విశాఖపట్నం రీజియన్ ఆధ్వర్యంలో ప్రప్రధమ ద్వైవార్షిక సమావేశం..పాల్గొన్న అతిరధ మహారధులు

MEDIA POWER
2 minute read
0


మీడియా పవర్, విశాఖపట్నం: జాతీయ బ్యాంకులను ప్రయివేటు పరం చేసే  ప్రయత్నాలను విరమించుకోవాలని, బ్యాంకు ఉద్యోగుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జనవరి 30, 31 తేదీలలో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి బిఎస్ రాంబాబు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ విశాఖపట్నం రీజియన్  ప్రప్రధమ ద్వైవార్షిక సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్ ఇంజనీరింగ్ ప్రాంగణంలోని  డాక్టర్ వైవిఎస్ మూర్తి సభామందిరంలో గురువారం ఏపీ యూనియన్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశ  కార్యక్రమానికి  రాష్ట్ర అధ్యక్షులు కాలే శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ  బ్యాంకులను ప్రైవేటీకరించి రుణాలను ఎగ్గొట్టిన వారిని బ్యాంకులకు అధిపతులను చేసేందుకు కుట్ర జరుగుతుందని  ఆరోపించారు.  దేశంలో ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిస్థితి, వీటిలో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితులను  వివరించారు. 2022 నవంబర్ 1వ  తేదీతో  11వ వేతన సవరణ  ముగిసిందని, 12వ వేతన సవరణకు సంబంధించిన ద్వైవార్షిక చర్చలు ప్రారంభానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బ్యాంకులలో ఐదు రోజుల పని దినాలను అంగీకరించాలని, ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు. 2010 తర్వాత బ్యాంకులలో చేరిన వారికి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. ఉద్యోగుల సమస్యలపై ఏ ఐ బి ఈ ఏ తీసుకుంటున్న చర్చల గురించి సవివరంగా వివరించారు. ఈ నెల 30 31 తేదీలలో సమ్మె ప్రకటన వెలువడిన తర్వాత ప్రభుత్వం నుండి 12వ వేతన సవరణ ద్వైవార్షిక చర్చలకు నోటీసు వెలువడడం తమ విజయయంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా బ్యాంకుల సర్వీసు నియమనిబంధనలు విధి విధానాలను వివరించారు. ఆల్ ఇండియా యూనియన్ బ్యాంక్ జనరల్ సెక్రెటరీ శంకర్ మాట్లాడుతూ ప్రైయివేటీకరణను నిలువరించేందుకు మరిన్ని పోరాటాలు చేసేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.  విశాఖపట్నం రీజనల్ సెక్రటరీ వసంతరావు అతిధులకు సభ్యులకు స్వాగతం పలికిన ఈ కార్యక్రమంలో ఏఐయుబిఐ, వర్కింగ్ ప్రెసిడెంట్ రవీంద్రనాథ్,  ఏపీ స్టేట్ జనరల్ సెక్రెటరీ వి.ఉదయ్ కుమార్ రీజినల్ హెడ్ కె.నటరాజ్  డిప్యూటీ రీజినల్ హెడ్   నరేష్ కుమార్ చైర్మన్ విజయభాస్కర్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ లక్ష్మీపతిరావు సెక్రెటరీ వి.శ్రీనివాసరావు వైస్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ ఏపీ జాయింట్ సెక్రెటరీ కాండ్రేగుల హరికృష్ణ పి శ్రీనివాసరావు సిహెచ్ అచ్చినాయుడు డిప్యూటీ రీజనల్ సెక్రటరీ అనిల్ కుమార్ సుజాత కోశాధికారి  శివ, దేవరపల్లి శ్రీనివాసరావు, గురుమూర్తి పండూరు గోవిందరావు సత్యనారాయణ రాజు ఆంధ్రప్రదేశ్ శాఖలో  ఉన్న రీజనల్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు . ఈ  సమావేశంలో నూతన రీజినల్ కమిటీ నాయకుల నియామకం జరిగింది. దీనిలో  కామ్రేడ్ ఆర్ వసంత రావు, రీజినల్ సెక్రెటరీ గా , కామ్రేడ్ అనీల్ కుమార్ డిప్యూటీ రీజినల్ సెక్రెటరీ గా, మహిళా డిప్యూటీ రీజినల్ సెక్రెటరీ గా కామ్రేడ్ సుజాత, కోశాధికారి గా కామ్రేడ్ శివ అసిస్టెంట్ రీజినల్ సెక్రెటరీ గా కామ్రేడ్ శ్రీనివాస రావు మరియు రీజినల్ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">