➤ విశాఖ శారదా పీఠంలో వేద పోషణ అభినందనీయం
➤ హర్యానా గవర్నరు బండారు దత్తాత్రేయ
➤ వార్షికోత్సవాల్లో రాజశ్యామలకు పూజలు
- మీడియా పవర్, విశాఖపట్నం, జనవరి 30 :- హర్యానా గవర్నరు బండారు దత్తాత్రేయ సోమవారం విశాఖ శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రాజశ్యామల యాగానికి హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం టీటీడీ నిర్వహణలోని శ్రీనివాస చతుర్వేద హవనం, సచ్చిదానంద విద్వత్ సభ నిర్వహణలో జరుగుతున్న శాస్త్ర, శ్రౌత సభలకు హాజరయ్యారు. పండిత ప్రముఖులు ఇచ్చిన ధర్మ సందేశాలను ఆసక్తిగా విన్నారు. అనంతరం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వాముల ఆశీస్సులు అందుకున్నారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం, వేద పోషణ కోసం విశాఖ శారదాపీఠం శ్రమిస్తున్న తీరు అభినందనీయమని అన్నారు. పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొని, పీఠాధిపతుల ఆశీర్వచనాలు అందుకోవడం ఆనందాన్నిచ్చిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మంచి వాతావరణం ఎల్లపుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు వివరించారు. శంకరాచార్య అడుగుజాడల్లో నడుస్తూ విశాఖ శారదాపీఠం చేస్తున్న అద్వైత ప్రచారం అత్యంత అభినందించ దగిన విషయమని అభివర్ణించారు.