గోపాలపట్నం, జనవరి 30: యోగ విజ్ఞాన సమితి వ్యవస్థాపకుడు రాజేంద్రప్రసాద్ మరియు ఉదయజ్యోతి ఎడిటర్, ప్రచురణ కర్త వంగూరి గణేశ్వరరావు సంయుక్తంగా నిర్వహించిన గాంధీ వర్ధంతి కార్యక్రమానికి ఆళ్వార్ దాస్ కళాశాల వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పి .గణబాబు విశిష్ట అతిధిగా బీజేపీ అధికార స్పోక్స్ పర్సన్ డా. సుహాసిని ఆనంద్ హాజరైనారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ కారక్రమం లో విద్యార్థులు ఏర్పాటు చేసిన 101 ఫోటోల ప్రదర్శనను ఉత్తర నియోజకవర్గ ఎంఎల్ఏ గణబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా వక్తలు డా. సుహాసిని ఆనంద్ విద్యార్థులలో సేవాభావం అలవరచుకోవాలని తెలిపారు. గాంధీజీ కుష్ఠువ్యాధిగ్రస్తులకు చేసిన సేవలను గుర్తుచేశారు. ఆమె ప్రసంగం ఆధ్యంతం పిల్లలు అత్యంత ఆశక్తితో విన్నారు. ప్రసంగం చివర ఆమె గాంధీజీ కి అత్యంత ఇష్టమైన రఘుపతి రాఘవ రాజారామ్ ...పతిత పవన సీతారాం .. అంటూ పిల్లలందరి చేత శృతి కల్పించారు. అనంతరం గణబాబు ప్రసంగిస్తూ ...ప్రతి ఒక్కరూ గాంధీజీ బాటలో నడవాలని ఇప్పటి నుంచి సేవ భావం అలవరచుకోవాలని తెలిపారు. జాతీయ కుష్టు నివారణ డిపార్ట్మెంట్ ద్వారా ప్రజలలో కుష్టు వ్యాధి పట్ల అవగాహన కల్పించుటకు, ముఖ్యంగా కుష్టు వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపకుండా ఉండుట తీసుకోవలసిన చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించే నిమిత్తము ఈ 15 రోజులపాటు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారుల ఆధ్వర్యంలో స్పెర్స్ లెప్రసి అవగాహన కార్యక్రమం-2023 నిర్వహించుట జరుగుతుందని డిపిఎంఓ ప్రసాదరావు తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కుష్టు అవగాహన ప్రచార కార్యక్రమంలో అందరూ భాగస్వాములై కుష్టు రహిత సమాజం కోసం చేయి చేయి కలుపుదాం అని పిలుపు నిచ్చారు. కుష్టు వ్యాధిగ్రస్తుల పట్ల ప్రేమాభిమానాలు చూపిస్తూ వారిని గౌరవిద్దాం, లెప్రసితో పోరాడుదాం, అంతమొందిద్దాం అన్న నినాదాలతో బాధ్యత గల పౌరులు అందరూ ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లెప్రసీ, ఎయిడ్స్ మరియు క్షయవ్యాధి నివారణ అధికారి ప్రసాద రావు , ఆళ్వార్ దాస్ కళాశాల ప్రిన్సిపాల్ భగవాన్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమం లో వ్యాధిగ్రస్తులకు దుప్పట్లు, పళ్ళు పంచిపెట్టారు.
కుష్టు రహిత సమాజానికి కృషి చేద్దాం.... వ్యాధిగ్రస్తులను ప్రేమిద్దాం ...గణబాబు
January 30, 20231 minute read
0
Tags