ఘనంగా ప్రారంభమైన పి.వి. రామరాజు స్మారక టి -20 క్రికెట్ పోటీలు ...

MEDIA POWER
0
పి.వి. రామరాజు స్మారక టి -20 క్రికెట్ పోటీలు స్థానిక పోలీస్ గ్రౌండ్స్ లో ఫిబ్రవరి 18వ తేదీన ప్రారంభమైనాయి. ఈ పోటీలు వైజాగ్ సిటీ పోలీస్ సిబ్బంది (సివిల్ , ఆర్మ్డ్ , రిజర్వు, హోమ్ గార్డ్స్ , మరియు కమ్యూనిటీ గార్డ్స్ వాటి వివిధ శాఖలలో పనిచేయుచున్న సిబ్బంది మొత్తం గా 8 ఎనిమిది టీములు గా ఏర్పడి ఐపిఎల్ పద్దతిలో ఏర్పాటు చేసి పోటీలు నిర్వహిస్తున్నారు. పి వి రామరాజు పోలీసు ఉద్యోగం చేస్తూనే ఆయనకు అత్యంత ఇష్టమైన క్రికెట్ ఆడేవారని, అంతే కాకుండా వైజాగ్ సిటీ పోలీస్ టీం తాయారు చేసి విశాఖ నగరంలో ఉన్న వి డి సి ఏ నిర్వహించు అనేక లీగ్ మ్యాచులలో పాల్గొనే విధంగా రిజిస్ట్రేషన్ చేయించిన ఉన్నత విలువలు, దూరదృష్టి కలిగిన అత్యంత ప్రతిభావంతుడని టోర్నమెంట్ నిర్వాహకులు తెలిపారు. ఆయన కెప్టెన్సీలో పోలీస్ టీం ఇన్స్టిట్యూట్ నిర్వహించిన మ్యాచులలో విజేతగా నిలిపాడని అన్నారు.
ఇప్పుడు జరుగుతున్న ఈ పోటీలు 18వ తేదీ నుంచి మే నెల 31 వరకు జరుగుతాయని తెలిపారు. పోలీసు వారి విధులకు ఆటకం కలుగకుండా సెలవు దినములలో ఉదయం 06:00 గంటలనుంచి 08:00 గంటల లోపు మ్యాచులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

ప్రారంభ రోజు మ్యాచ్ లో రాయల్ టైగర్స్ మరియు ఖాకీ జైంట్ ఫైటర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఖాకీ జైంట్ ఫైటర్స్ 3 వికెట్ల తేడాతో ప్రత్యర్థి జట్టయిన రాయల్ టైగర్స్ పై విజయాన్ని నమోదుచేసింది. మాన్ అఫ్ ది మ్యాచ్ గా ఖాకీ జైంట్ ఫైటర్స్ టీము సభ్యుడు కోలా దీపు నిలిచాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">