కొన్ని దుష్టశక్తులు ఇతర మార్గాల ద్వారా దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని అటువంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన యువతను హెచ్చరించారు.
ధనేలి గ్రామంలోని రావత్ పురా సర్కార్ యూనివర్సిటీలో నెహ్రూ యువ కేంద్ర సంస్థాన్ ఛత్తీస్ గఢ్ యూనిట్ నిర్వహించిన యువ సంవాద్ ఇండియా @2047లో ఠాకూర్ ప్రసంగించారు.మన వారసత్వ సంపద, చరిత్ర, కళలు, సంస్కృతి, సంప్రదాయాలను చూసి మనం గర్వపడాలి అని తెలిపారు.
పాశ్చాత్య దేశాల మనస్తత్వాన్ని 70 ఏళ్ల పాటు మన దేశంపై రుద్దారు. ఈ ఆలోచనను మార్చే పని గత ఎనిమిదేళ్లుగా జరిగింది' అని బీజేపీ నేత పేర్కొన్నారు. అద్భుతమైన సోమనాథ్ ధామ్, కాశీ ధామ్, కేదార్నాథ్ ధామ్, మహాకాల్ ధామ్లను నిర్మించామని, వచ్చే ఏడాది అయోధ్య ధామ్ నిర్మాణం పూర్తవుతుందని ఆయన అన్నారు. ఈ ప్రదేశాల అభివృద్ధితో పర్యాటకుల తాకిడి పెరిగిందని, స్థానికులకు ఉపాధి లభిస్తోందని మంత్రి తెలిపారు.
అయితే అయన ప్రసంగంలో ఏ 'రిపోర్టు'ను, 'బిలియనీర్'ను ప్రస్తావిస్తున్నారు అన్న విషయాన్నీ వెల్లడించలేదు. దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని మాత్రమే ఠాకూర్ పేర్కొన్నారు.